Thursday, March 28, 2024

మనోవ్యాధి చికిత్స కోసం గంజాయి ఆధారిత ఔషధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అప్పుడప్పుడు వచ్చే అరుదైన, లేదా తీవ్రమైన మూర్ఛ రోగ లక్షణాలను బట్టి చికిత్స కోసం ప్రస్తుతం కెనబిడియల్ ( cannabidiolcbd) ఔషధాన్ని డాక్టర్లు ప్రిస్రైబ్ చేస్తున్నారు. ఉదాహరణకు బ్రిటన్‌లో అరుదైన , తీవ్రమైన మూర్ఛవ్యాధికి, కీమోథెరపీ చికిత్స( క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా నాశనం చేసే మందులను గుర్తించడానికి ఉపయోగించే చికిత్సను కిమోథెరపీ అంటారు) వల్ల వచ్చే వాంతులు, వికారం వంటి వాటిని నివారించడానికి కెనబిడియల్ ఔషధాన్ని వాడతారు. అయితే గంజాయి ఆధారిత ఔషధం మనోవ్యాధి చికిత్సకు ఉపయోగపడుతుందా లేదా అన్నది నిర్ధారించుకోడానికి ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో భారీ ప్రయోగాలను చేపట్టారు. ఇందులో ప్రధానంగా ఐరోపా, ఉత్తర అమెరికాలోని 35 కేంద్రాలను తీసుకుంటారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ లోని సైకియాట్రీ విభాగం దీన్ని సమన్వయం చేస్తుంది. వెల్‌కమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఈ ట్రయల్స్‌కు 16.5 మిలియన్ పౌండ్లను కేటాయించింది.

సైకోసిస్ రోగులకు అందించే కొత్తచికిత్సల్లో కెనబిడియోల్ చాలా నమ్మకమైన ఔషధమని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మెక్‌గైర్ వెల్లడించారు. ఈ ట్రయల్స్‌కు మెక్‌గైరే నేతృత్వం వహిస్తున్నారు. సిబిడి (cbd) అన్నది గంజాయిలో కనిపించే ఒక రసాయనం. అయితే ఇది టెట్రాహైడ్రోకెనబినోల్ ( tetracannabinol ) అన్నది కలిగి ఉండదు. గంజాయిలో ఉండే ఈ మూలకం మత్తుగా ఉండేలా చేస్తుంది. ఈ మేరకు మనోవ్యాధి( psychosis ) ప్రారంభ దశ కార్యక్రమంలో 1000 మందిని ఇందులో చేరుస్తారు. వైద్యపరంగా సైకోసిస్ ఎక్కువ రిస్కు ఉన్న వారిని కూడా ఇందులో కలుపుతారు. సంప్రదాయ వైద్యానికి స్పందించని వారు కూడా ఉంటారు. సైకోసిస్‌ను చికిత్స చేయడం ఎలాగూ ఉన్న ప్రక్రియే.

అయితే రోగుల్లో ఎక్కువ రిస్కుతో ప్రారంభమయ్యే సైకోసిస్‌ను కెనబిడియల్ నివారిస్తుందా లేదా అన్నది పరిశీలిస్తామని మెక్‌గైర్ చెప్పారు. ఈ అధ్యయనం సైకోసిస్‌కు కొత్త రకమైన చికిత్సను అందిస్తుందని ఆశిస్తున్నామని అభిప్రాయ పడ్డారు. సైకోసిస్ చికిత్సకు సాధారణంగా ఉపయోగించే యాంటీ సైకోటిక్స్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. అందువల్ల రోగులు తరచుగా వాటిని వాడకుండా ఆపేస్తున్నారు. అదీకాక ఇవి సైకోసిస్ రోగులు అందరికీ సరిగ్గా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త చికిత్స కోసం అన్వేషించ వలసిన అవసరం ఉందని వెల్‌కమ్ మెంటల్ హెల్త్ ట్రాన్స్‌లేషన్ అధినేత లిస్నీ బిల్స్‌ల్యాండ్ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఈ ట్రయల్స్‌లో రోగుల స్పందన కూడా పరిశీలిస్తారు. ఆ సమయంలో కనిపించే జీవ సంకేతాలను జాగ్రత్తగా గమనిస్తారు. ఈ ప్రక్రియ భవిష్యత్తులో సైకోసిస్ చికిత్సలో గొప్ప వ్యక్తీకరణ అవుతుందని ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News