Friday, May 3, 2024

గంజాయి దొంగల పట్టివేత

- Advertisement -
- Advertisement -

Cannabis gang captured by police

మన తెలంగాణ,అశ్వాపురం: అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వాపురం సిఐ సట్ల రాజు అన్నారు. శనివారం పోలీసు స్టేషన్ లో జరిగిన మీడిమా సమావేశంలో ఆయన గంజాయి దొంగల ప్రవేశపెట్టారు. ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు మండల పరిదిలోని కట్టంవారిగూడెంలో శుక్రవారం సాయంత్రం ఎసైఐ రాజేష్, పోలీసులు మండల కృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించగా 3 కేజీల 500 గ్రాముల గంజాయి పట్టు పడిందని తెలిపారు. వీరు ఒరిస్సా నుండి ఇక్కడకు వచ్చిన జాలర్లు అని, అక్కడి పరిచయాలతో గంజాయిని ఇక్కడకు తరలించి స్థానికంగా విక్రయిస్తున్నారని అన్నారు. నిందితుల నుండి గంజాయితో పాటు రూ.18,000, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
…. ముందే చెప్పిన మన తెలంగాణ…అశ్వాపురం మండలంలో మల్లెల మడుగు, మొండికుంట, రామచంద్రపురం, తుమ్మల చెరువు, అశ్వాపురం, కట్టంవారి గూడెం, తదితర ప్రాంతాలలో విచ్చల విడిగా గంజాయి అక్రమ రవాణా జరుగుతందని మన తెలంగాన దిన పత్రిక గత నెలలోనే ఆదారాలతో సహ ప్రచురించింది. ఆలస్యంగానైన మేల్కొన్న పోలీసులు గంజాయి దొంగల భరతం పడుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నా బడా బాబుల వైపు కూడ ఒక కన్నేస్తే మండలంలో అక్రమ రవాణాను అడ్డుకట్టవేయవచ్చని మండల ప్రజలు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News