Thursday, May 2, 2024

9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు హాజరు కాలేం

- Advertisement -
- Advertisement -

9న జరిగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేం
అదే రోజు సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉంది
కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో
ఎపి అభ్యంతరం చెప్పడంపై తెలంగాణ నిరసన
రెండు బోర్డులకు లేఖ రాసిన ఈఎన్సీ మురళీధర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 9వ తేదీన(సోమవారం) జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జిఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. ఈ నెల తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉందని ఆ కారణంగా బోర్డు సమావేశానికి హాజరవ్వడం వీలుపడదని ఆయన ఆ లేఖలో తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించి తదుపరి సమావేశం తేదీని ఖరారు చేయాలని, వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు.
కెఆర్‌ఎంబికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పడంపై తెలంగాణ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కూడా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల సందర్శన కమిటీలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉండడంపై ఎపి అభ్యంతరం వ్యక్త చేసింది. దీనిని తప్పుపట్టిన తెలంగాణ గతంలో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి సందర్శన సమయంలో కె.శ్రీనివాస్ విషయంలో తాము అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. సీడబ్ల్యూసీ అధికారికి ఎపి ఇతరత్రాలను ఆపాదించడం దురదృష్టకరం, ఇది అనైతికమని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేసేందుకే ఎపి ఇలా వ్యవహరిస్తోందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. ఈ సంఘటనను తీవ్రంగా నిరసిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కెఆర్‌ఎంబీ బృందం రాయలసీమ పనులను పరిశీలించి ఈ నెల తొమ్మిదో తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ కోరింది.
9వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి(KRMB, GRMB Boards Meeting) సమావేశం జరగనుందని కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు కెఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అజెండా అంశాలపై చర్చకు సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.
9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి బోర్డుల..
ఈనెల 3వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ జరిగింది. హైదరాబాద్ జలసౌధలో జిఆర్‌ఎంబీ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. ఎపి నుంచి ఆ రాష్ట్ర ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీశ్, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ వచ్చారు. అంతకు ముందు రోజు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని కోరారు. ఈ దశలో ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి (KRMB, GRMB Boards Meeting) సంయుక్త సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇదీ ఇలా ఉండగా కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడినట్టుగా సమాచారం.

Can’t attend to Godavari river board meeting: Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News