Wednesday, May 1, 2024

కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

Car catches fire in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పలువురు ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. కారులో డ్రైవర్ వస్తుండగా రోడ్డు నంబర్ 10లో వెగంగా వెళ్తున్న ఎపి 25 ఎడి 2527 నంబర్ గల కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించి డ్రైవర్ వెంటనే కారు ఆపి కిందికి దిగాడు. తర్వాత కారు మొత్తం మంటలు చెలరేగాయి, ఇంజిన్‌లో షార్ట్ సర్కూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News