Sunday, April 28, 2024

కదనోత్సాహంతో కారు దూసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నాచారం/మల్కాజ్‌గిరి: కదనోత్సాహంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడాలా..! మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కారు దూసుకు పోవాలా.. గులాబీ జెండా ఎగరాలా… అని బిర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అన్నారు. ఆదివారం నిర్వహించిన ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గ బిఆర్‌ఎ స్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ 100 రోజులు ఓపిక పడతామని,మార్చి17వరకు ఇచ్చిన హామీల ను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడతామనిస్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారన్నారు.

కాంగ్రెస్‌ను మల్కాజ్‌గిరిలో మడత పెట్ట్టి కొట్టుడే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసి న 420 హామీలను నమ్మి జిల్లాలో జనం మోసపోయారని ఎద్దెవా చేశారు. ఉప్పల్‌లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా?.. లేక కాంగ్రెసోడు ఉన్నాడా? అర్దం కావటం లేదన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టుడేనన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అస్యహించు కుంటున్నారని వెల్లడించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారు గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదని సెటైర్‌లు వేశారు. రేవంత్ రెడ్డిలాగా మేము తిట్టగలుతాం కానీ వారి గౌరవానికే వదిలేస్తున్నామన్నారు. మొన్న తెలం గాణలో వచ్చిన అంసెబ్లీ ఎన్నికల పలితాలు మన మంచికే వచ్చాయన్నారు. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలుస్తుంది.. ఇప్పుడు.. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి పూర్తిగా తెలిసోస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తుందన్నారు. ఏది చేయాలన్న కూడా ఢిల్లీ పెద్దలచుట్టు తిరుగుతు ఉంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రజలు బిఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యిందని, అప్పుడే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయని విమర్శించారు. రైతులకు రైతు బంధు పడలేదని, ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని, ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనారన్నారు. నోటికొ చ్చిన మాటలు అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయ లేదని మండిపడ్డారు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారన్నారు. 100 రోజుల తర్వాత కాం గ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరని, ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ప్రజలు తిరగబడుతారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మేం నెరవేర్చుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఆ మాట ఎన్నికల ముం దు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సీటు బిఆర్‌ఎస్ గెలవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గులాబీ జెండా ఉంటే నే మన ఎంపిలు గెలిస్తేనే మన రాష్ట్ర సమస్యలు మాట్లాడుతారని స్పష్టం చేశారు. మన అధినేత కెసిఆర్ ఎంపిగా ఎవరికి అవకాశం ఇచ్చిన భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను కాపాడుకుంటామని, వారికి పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News