Friday, May 3, 2024

మఖ్దూమ్… షాయర్‌కీ షాన్

- Advertisement -
- Advertisement -

ఆ కలం నిశీధిని చేదించి వెలుగులు పంచుతూ కవితా కాంతి తరంగాలను సృష్టించే విద్యుత్ స్థంభం, ఆ కలం దిక్కులు పిక్కటిల్లే ల జన ప్రభంజనాన్ని జాగృత పరిచే అక్షర ఫిరంగి, ఆ కలం హైదరాబాద్ నగర నడివీధుల్లో తిరుగాడుతూ అణిచివేత పై పిడుగుల ఘర్జిస్తూ అసమానతలు తొలగించాలని ఆరాటపడుతూ పీడిత పక్షాన నిలబడి కలబడే యుద్ధ నినాదం, ఆ కలం ఆధిపత్యాన్ని కూల్చే కవిత్వపు కరవాలం ఆ కలానికి పేరంటూ ఉంటే అది ఖచ్చితంగా మగ్దూం మోహినుద్దీన్ అయి తీరుతుంది కవిగా నటుడిగా నాటక రచయితగా విప్లవకారుడిగా సినీ గేయ రచయితగా కార్మిక నాయకుడిగా రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. రా ఈ శిథిలాలపై స్వాతంత్ర పతాకం ఎత్తు, రా ఈ శిథిలాలపై రక్త పతాకం ఎత్తు అంటూ కర్తవ్యాన్ని బోధించినా, మరఫిరంగుల నోటి నుండి మరణ గీతం మోగుతుంది ప్రళయాజ్ఞులు ప్రజ్వలించే అంటూ నాటి స్థితిని పరిచయం చేసినా, చలేతో సారే జమానే కో లేకే చలో అంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టినా చీకటి మూకటి మినహా ఏమున్నది రాత్రి వద్ద అంటూ చీకటిని ప్రజల దుర్భర వ్యవస్థతో పోల్చినా భారతదేశపు మార్గదర్శి నా తెలంగాణ విప్లవ నాదం వినిపిస్తుంది తెలంగాణ అంటూ తెలంగాణపై అవ్యాజ్యమైన ప్రేమను చూపినా అది మఖ్దూం కు మాత్రమే చెల్లుతుంది.

తెలంగాణలోని మెదక్ జిల్లా ఆందోల్ లో ఫిబ్రవరి 4న 1908 లో ఉదయించిన కవితా భానుడు. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని ఆజంఘడ్ లో ఉండేవారు ఔరంగాజేబ్ సైన్యంతో పాటు వారి తాతల తరం 1857 లోనే హైదరాబాద్ చేరుకుంది తండ్రి మోహినుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరిండెంట్ గా పని చేసేవాడు మూడేళ్ల ప్రయాణంలో తండ్రి చనిపోయి తల్లి వేరే పెళ్లి చేసుకోవడంతో మఖ్దూం బాబాయి అయిన బషీరుద్దీన్ దగ్గర పెరిగాడు ప్రాథమిక విద్య హైదరాబాదులోని ధర్మవంత హైస్కూల్లో మెట్రిక్యులేషన్ సంగారెడ్డిలో డిగ్రీ, ఎం.ఎ ఉస్మానియాలో చదివాడు ఉస్మానియా హాస్టల్లో ఉన్నప్పుడే తన తొలి కవిత టూర్ 1934లో రచించాడు అదే సంవత్సరం బెర్నార్డ్ షా నాటకానికి హోష్ కే నా ఖూన్ ను ఉర్దూ అనుసరణ చేసి హైదరాబాదులో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించారు. దానికి ముగ్ధుడైన ఠాగూర్ ఆనందం పట్టలేక నాటకం పూర్తికాగానే స్టేజ్ పైనే అభినందించి శాంతినికేతన్ కి వచ్చి చదువుకోమని ఆహ్వానించాడు అదే స్ఫూర్తితో 1937లో మష్యదే కామిల్ అనే మరో నాటకం రాశాడు ఉర్దూ నాటకంపై ఒక పరిశోధనా పత్రం రాశాడు.

జీవించడం కోసం ఎన్నో పనులు చేశాడు పెయింటింగ్స్ సినీ తారల ఫోటోలు అమ్మాడు పత్రికల్లో పని చేసాడు ఒక నవాబు దగ్గర ఉర్దూ ప్రేమ లేఖలు రాసి కడుపు నింపుకున్నాడు తర్వాత సిటీ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశాడు ఆ సమయంలో కమ్యూనిస్టు పత్రిక నేషనల్ ఫ్రంట్ సంపాదించి చదివేవాడు ఆ రోజుల్లో ఆ పత్రిక చదవటం నేరం దాని ప్రభావంతో చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం వదిలి అక్షరంతో పాటు ఆయుధాన్ని ఎత్తాడు 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, హమీద్ అలీ, రాజ బహదూర్ గౌర్ లాంటి నాయకులతో కలిసి పనిచేశారు అభ్యుదయ రచయితల సంఘం స్థాపించాడు రైతుకు రొట్టెనివ్వని పొలమెందుకు కాల్చేయండి ప్రతి గోధుమకంకిని అన్న ఇక్బాల్ కవితను నినదించేవాడు. ఆల్విన్, షాబాద్ సిమెంట్ , చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఎన్‌ఎస్‌ఆర్ రైల్వే ఎంప్లాయ్, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ ,

బటన్ షాప్ లాంటి ఎన్నో కంపెనీలలోని కార్మిక సంఘాలకు అధ్యక్షుడై అహోరాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చిన త్రిమూర్తుల్లో ఒకడు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత ఎమ్మెల్సీగా సేవలందించాడు మంచి వాగ్దాటి తో అసెంబ్లీలో కార్మిక సంఘ సమావేశాల్లో అద్భుతంగా ప్రసంగించేవాడు, ఉర్దూలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు అతని గజల్ లు పాఠ్యాంశాలలో సినిమాల్లోనూ ఉపయోగించేవారు అతను రాసిన ఏ జంగ్ హై జంగే ఆజాది, ఏ చంబే లికే మoడ్వే తలే అనే గీతాలు ప్రసిద్ధి పొందినవి. ఆ ఉర్దూ కవితలు దాశరధి తెలుగులో అనువదిస్తూ గానం చేసేవారు ఫిల్చిడి బాత్ బాత్ ఫులోoకి గజల్ తో జాతీయ గుర్తింపు పొందాడు 1969 ఆగస్టు 25 గుండెపోటుతో మరణించాడు తన కవిత్వంతో నిర్విరామంగా వెలుగులు పంచుతూ కవితా లోకానికి సమాజానికి దిక్సూచిగా మిగిలిన మాఖ్దూo అందరికి ఆదర్శం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News