Sunday, April 28, 2024

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న అనిల్ చౌహాన్ ఒక ప్రశ్నకు స్పందించి సమాధానం ఇచ్చారు. 21 వ శతాబ్దంలో భారత్‌కు ఎదురౌతున్న పెద్ద భద్రతా సవాళ్లపై వచ్చన ప్రశ్నకు ఆయన స్పందించారు. భారత్ తన సరిహద్దులను కాపాడుకునే విషయంలో అవసరమైన వనరులు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర భారత వివాదాస్పద సరిహద్దుల విషయంలో భద్రతను కాపాడుకోగల వనరులు ఉన్నాయని వివరించారు.

బయట నుంచి వచ్చే సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని, తక్షణం వాటి విషయం లోనే ఆందోళన చెందవలసి ఉందన్నారు. ఈ బాహ్య సవాళ్లు కూడా జాతిని సమైక్యపరుస్తాయని పేర్కొన్నారు. సాయుధ దళాలకు సంబంధించి తక్షణ సవాలు చైనాతో ఇంకా పరిష్కారం కాని సరిహద్దు తోనే అని చెప్పారు. మన పొరుగున ఉన్న పాక్, చైనా దేశాల మధ్య స్నేహం రోజురోజుకూ హిమాలయాలంత ఎత్తు, సముద్రమంత లోతుకు విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాలూ అణుసామర్ధం కలిగినవేనని చెప్పారు. ఈ సవాళ్లు తాము ముందునుంచీ ఊహిస్తున్నవేనని, మరికొన్ని ఊహించని పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా నూతన కొత్త ఆయుధ వ్యవస్థలను, సాంకేతికతలను, వ్యూహాలను రూపొందించుకోవలసి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News