Saturday, July 27, 2024

ఇది మంచి పద్ధతి కాదు.. జైరామ్ రమేష్‌కు సీఈసీ అక్షింతలు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశ వ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు. “ ఎవరైనా ఒకరు అందర్నీ (జిల్లా మెజిస్ట్రేట్లు/రిటర్నింగ్ అధికారులు) ప్రభావితం చేయగలుగుతారా ? ఇదెవరు చేశారో మాకు చెప్పండి. ఆ పనిచేసిన వ్యక్తిని మేము శిక్షిస్తాం.

వదంతులు సృష్టించడం ప్రతి ఒక్కరిని అనుమానించడం ఎంతమాత్రం మంచిది కాదు” అని రాజీవ్ కుమార్ సోమవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు ముందు సీఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా పార్టీల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణన లోకి తీసుకున్నామని సీఈసీ చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. కంట్రోల్ యూనిట్స్ కదలికలను సీసీటీవీ కెమెరా ద్వారా మానిటరింగ్ చేయాలని కోరారని, ఆ పని తాము చేస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News