Thursday, May 2, 2024

మార్చి 31వరకూ పాత లైసెన్సులే

- Advertisement -
- Advertisement -

Central Government Driving License Validity Extended

న్యూఢిల్లీ: వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించింది. ఇంతకు ముందు మూడు సార్లు ఈ గడువు పొడిగిస్తూ వచ్చారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మార్చి 31వ తేదీ వరకూ దీనిని పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సంబంధిత పత్రాల కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన వాటికి ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఆగస్టు 24వ తేదీన రవాణా, హైవేల మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రకటనలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు ( అన్ని రకాలు), డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్లు అన్ని కూడా డిసెంబర్ 31వరకూ చెల్లుతాయని తెలిపారు. ఈ గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు మరో దఫా పొడిగింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

Central Government Driving License Validity Extended

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News