Wednesday, May 8, 2024

రాష్ట్రానికి పదో విడత జిఎస్‌టి నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

10వ విడతలో రూ .6 వేల కోట్లు జిఎస్‌టి నిధుల విడుదల
స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో రాష్ట్రానికి రూ.943.74 కోట్లు

GST revenue exceeds Rs 1 lakh crore

మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎస్‌టి నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ 10వ విడత కింద సోమవారం మరో రూ.6,000 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. వీటిలో 23 రాష్ట్రాలకు రూ .5,516.60 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఢిల్లీ, జమ్మూ..కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) రూ .483.40 కోట్లు విడుదల చేశారు. జిఎస్‌టి అమలు కారణంగా తలెత్తే ఆదాయంలో రూ .1.10 లక్షల కోట్ల కొరతను తీర్చడానికి కేంద్రం గత అక్టోబర్ నెలలో ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, యుటిల తరపున కేంద్రం బోర్‌వోయింగ్‌లు చేస్తున్నారు. ఇప్పటివరకు 4.6892 శాతం వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ .60,000 కోట్లు రుణం తీసుకుంది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 947.73 కోట్ల పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది.
జిఎస్‌టి అమలు కారణంగా ఆదాయ కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు ఎంపికను ఎంచుకునే రాష్ట్రాలకు స్థూల రాష్ట్రాల దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.50శాతానికి సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆప్షన్….-1ని ఎంచుకున్న అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యతను ఇస్తూ, ఈ నిబంధన ప్రకారం 28 రాష్ట్రాలకు మొత్తం రూ.1,06,830 కోట్లు (జిఎస్‌డిపిలో 0.50శాతం) రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Centre releases Rs 947 Cr GST Compensation to TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News