Tuesday, May 21, 2024

పాపం పసివాళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఉప్పల్: పాఠశాలకు వెళ్లిన వి ద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందిన ఘటన రామాంతాపూర్‌లో జరిగింది. టీచర్ దెబ్బలతో తమ కుమారుడు మృతి చెందాడని పాఠశాల ఎదుట తల్లిదండ్రులు సోమవారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. రామాంతాపూర్ డివిజన్ వివేక్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 10లో నాగ రాజు దంపతులు నివసిస్తున్నారు. శనివారం స్థా నికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో కు మారుడు హేమంత్ యూకేజీ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం హేమంత్ అపస్మారక స్థి తిలోకి వెళ్లాడని తల్లిదండ్రులకు పాఠశాల సి బ్బంది సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఆసు పత్రికి తీసుకెళ్లగా తలకు బలమైన గాయ మైం దని, తీవ్రరక్తస్రావం కావడంతోనే మృతి చెందా డని కుటుంబసభ్యులకు వైద్యులు సూచిం చారు. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టిన దెబ్బలతోనే తమ కుమారుడు చనిపోయాడని స్కూల్ ఎదుట బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇదే వి షయపై పాఠశాల యాజమాన్యం గడిచిన వారం రోజులగా హేమంత్ పాఠశాలకు రావడం లేదని తెలిపారు. శనివారం మధ్యాహ్నం హోంవర్క్ చేపి స్తున్న సందర్భంలో స్పృహ తప్పడంతో తల్లిదం డ్రులకు సమాచారం అందించారు. కావాలనే త మపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఇదే విషయమై పోలీ సులను వివరణ అడగగా ఇప్పటి వరకు మాత్రం బాలుడి మృతిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
కరెంటు షాక్‌తో చిన్నారి మృతి
మన తెలంగాణ/ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలోని ఎన్‌మార్ట్ సూపర్ మార్కెట్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నవీపేట్ గ్రామానికి చెందిన గూడూరు రిషిత (4) తన తండ్రితో కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. సూపర్ మార్కెట్లో చాక్లెట్లు తీసుకునేందుకు ఫ్రీజ్ డోర్ దగ్గరికి వెళ్లి డోరు పట్టుకునేసరికి కరెంటు షాక్ తగిలి కదలేని స్థితిలోకి వెళ్లింది. పక్కనే ఉన్న రిషిత తండ్రి గమనించి చిన్నారిని వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రిషిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. నిత్యం వందలాది మంది సూపర్ మార్కెట్‌కు వచ్చి సామానులు కొనుక్కుపోతారని ఇంత పెద్ద సూపర్ మార్కెట్లో నాసిరకమైన ఫ్రీజ్ పెట్టడం వల్ల చిన్నారి మృతి చెందిందని బంధువులు గ్రా మ ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News