Thursday, May 2, 2024

గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

- Advertisement -
- Advertisement -

China and Indian troops pull back from Galwan Clash

న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్ 15 నుంచి రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు వివాదంపై చైనా ఆర్మీ ఉన్నతాధికారులు ఓ వైపు భారత్‌తో చర్చలు జరుపుతూనే మరోవైపు భారీగా సైన్యాన్ని సరిహద్దుకు తరలించింది. దీంతో అప్రమత్తమైన భారత్ కూడా యుద్ధ విమానాలు, ట్యాంకులతో సైనికులను సరిహద్దుకు పంపింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అకస్మింగా లడక్ పర్యటించడంతో చైనా షాక్ గురైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. దీంతో చైనాకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. సరిహద్దు వివాదంపై పలు ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలవడంతో చైనా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం చైనా ప్రభుత్వం తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. వివాదాస్పదమైన గాల్వన్ ప్రాంతం నుంచి చైనా పీపుల్స్ ఆర్మీ కిలోమీటర్ వెనక్కి వెళ్లింది. ఆ ప్రాంతం నుంచి టెంట్‌లు, వాహనాలను చైనా తొలగించింది.

China and Indian troops pull back from Galwan Clash

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News