Tuesday, May 7, 2024

లద్ధాఖీల పచ్చిక భూములు చైనా కబ్జా: రాహుల్ ఆవేదన

- Advertisement -
- Advertisement -

లేహ్ : అత్యంత కీలకమైన లద్ధాఖ్ భూభాగంపై ప్రధాని మోడీ చెప్పేవని అబద్ధాలే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా చైనాపరం కాలేదని ప్రధాని ఎంతకాలం బుకాయిస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇప్పుడు లేహ్ ప్రాంతంలో ఐదారు రోజుల పర్యటనకు వచ్చారు. తాను ఇక్కడ పలువురు లద్ధాఖీలను కలిసినట్లు, వారు ఇక్కడి వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితిని తనకు తెలిపినట్లు వివరించారు. చైనా సైన్యం ఇక్కడ తమ పశువుల మేత జాగాలలో తిష్టవేసుకుని ఉన్నాయని, తాము అక్కడికి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారని, దీనిపై ప్రధాని ఏమంటారు? అని రాహుల్ ప్రశ్నించారు. తరచూ లేహ్ ప్రాంతానికి పర్యటనకు వచ్చే రాహుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దశలో ఆదివారం తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో ముందుగా ప్యాంగాంగ్ సరస్సు వద్ద నివాళులు అర్పించారు.

ఇక్కడి పాడి మేత భూములు చైనా సైన్యం ఆక్రమించుకుందని, ఇక్కడి వారంతా తనకు తెలిపారని రాహుల్ చెప్పారు. పరిస్థితి గురించి ఇక్కడి వారు ఈ విధంగా చెపుతూ ఉంటే మోడీ ఎంతకాలం బుకాయింపులకు దిగుతారని ప్రశ్నించారు. తాను ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పర్యటిస్తానని, తాను ఇప్పటికే ప్యాంగాంగ్‌కు వెళ్లినట్లు ఇప్పుడు నుబ్రా, కార్గిల్‌కు వెళ్లుతున్నట్లు చెప్పారు. ఇక్కడి వారు ఏ విధంగా బాధ పడుతున్నారు? వారు చెప్పదల్చుకున్నదేమిటీ తెలుసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. ఈ ప్రాంతానికి ఇప్పటికీ సెల్ సౌకర్యం లేదు. దీనితో ఈ ప్రాంతం వారు తమ బాధలను ఇతరులతో పంచుకోలేకపోతున్నారని, అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారని రాహుల్ తెలిపారు.

నాన్న భారత్ నీ జ్ఞాపకాల్లో రాజీవ్ తీసిన ఫోటోల విడుదల
రాహుల్ గాంధీ ఆదివారం అత్యంత అరుదైన ఫోటోలను తన ట్విట్టర్‌లో పొందుపర్చారు. తండ్రి రాజీవ్ గాంధీ భారతదేశంలో పలు ప్రాంతాలలో స్వయంగా తీసిన ఫోటోలను , ప్రత్యేకించి లద్ధాఖ్ ప్రాంతంలో ఆయన ఏరికోరి పలు ప్రాంతాల్లో తిరిగిన దశలో క్లిక్ మన్పించిన ఫోటోలను పొందుపర్చారు. ఈ నేపథ్యంలో పాపా (నాన్న) నీ భారత్ నీ కళ్లతో అనే శీర్షికతో ఫోటోలు పరిచయం చేశారు. తండ్రి రాజీవ్‌కు ఇది తన తరఫున జన్మదిన స్పందన అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News