Sunday, April 28, 2024

సోలార్ తో సంవత్సరానికి రూ. 12 .30 లక్షలు మిగులుబాటు

- Advertisement -
- Advertisement -

మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు
సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనంలో సోలార్ ఛార్జింగ్

మన తెలంగాణ/ హైదరాబాద్ :  సోలార్ విద్యుత్ ఏర్పాటుతో సాలీనా రూ. 12 లక్షల 30 వేల విద్యుత్ చార్జీలు మిగులుబాటు అవుతుందని రెడ్‌కో ఎండి వి. సి జానయ్య వెల్లడించారు. గ్రీన్ ఏనర్జీనీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతో అన్ని జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత ప్రభుత్వా కార్యాలయాల భవనాలలో సోలార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో బాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం మొట్టమొదటి సారిగా సూర్యాపేటలో ఆదివారం ప్రారంభమైన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్‌ను ప్రారంభించమన్నారు. దీని ద్వారా సంవత్సరానికి 15 లక్షల విద్యుత్ యూనిట్లు ఉత్పత్తి అవుతుందని తద్వారా ప్రభుత్వానికి సాలీనా రూ. 12 లక్షల 30 వేలు విద్యుత్ చార్జీలు మిగులుతాయని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ కాలపరిమితి 25 సంవత్సరాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News