Sunday, April 28, 2024

గల్వాన్ లోయలో సైనికుల మృతిపై మొదటిసారి ధ్రువీకరించిన చైనా

- Advertisement -
- Advertisement -

China finally admits casualties during Galwan clash

బీజింగ్: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత సైనిక దళాలతో జరిగిన ఘర్షణల్లో చైనాకు చెందిన ఐదుగురు సైనిక అధికారులు, జవాన్లు మరణించినట్లు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) మొట్టమొదటిసారి శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. 2020 జూన్‌లో గల్వాల్ లోయలో భారత్‌తో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో కరకోరమ్ పర్వతాలలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనిక జవాన్లు ప్రాణ త్యాగం చేశారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆఫ్ చైనా(సిఎంసి) గుర్తించినట్లు చైనా అధికారిక వార్తా పత్రిక పిఎల్‌ఎ డైలీ శుక్రవారం తెలిపింది. మృతులలో పిఎల్‌ఎ జింజియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటల్ కమాండర్ కీ ఫబావో ఉన్నట్లు పత్రిక తెలిపింది. సరిహద్దుల పరిక్షణ కోసం పోరాడుతూ అమరుడైన కీ ఫబావోకు హీరో రెజిమెంటల్ కమాండర్ టైటిల్‌ను సిఎంసి ప్రకటించినట్లు పత్రిక వివరించింది. సిఎంసి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సారథ్యం వహిస్తున్నారు. గల్వాన్ లోయలో గత ఏడాది జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News