Thursday, May 2, 2024

చైనానే మా నేస్తం

- Advertisement -
- Advertisement -

China is our most important partner says Taliban

తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం

డ్రాగన్‌తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం

పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో కొత్త ప్రభుత్వ స్థాపన నేపథ్యంలో తాలిబన్ల నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. దెబ్బతిని ఉన్న అఫ్ఘనిస్థాన్ పునర్ని ర్మాణానికి తాము చైనా సాయం కోసం ఎదురుచూస్తు న్నామని తాలిబన్లు తెలిపారు. దేశంలోని సుసంపన్నమై న తగరపు నిక్షేపాలను వెలికితీయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవచ్చునని తాలిబన్లు అభిప్రాయప డ్డారు. చైనా ఇందుకు సిద్ధంగా ఉందని తమకు నమ్మకం కుదిరినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ము జాహిద్ ప్రకటించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిరకాలపు అంతర్యుద్ధంతో చితికిపోయింది.

దేశంలో ఆకలికేకలు, పేదలకు కూలీపని కూడా దొరకని స్థితి నెలకొంది. వీటి ని దృష్టిలో పెట్టుకునే తక్షణం తమను బాగా ఆదుకునే దేశం చైనానే అని, పైగా పరోక్షంగా సూపర్‌పవర్‌గా ఉన్న దేశం కావడంతో అఫ్ఘన్ వికాసానికి తోడ్పాటు అం దించడంలో ఎటువంటి ప్రతిబంధకాలు ఉండబోవని తా లిబన్లు భావిస్తున్నారు. ఇప్పటికే చైనా తాలిబన్ల ప్రాబ ల్యాన్ని గుర్తించింది. అఫ్ఘన్ తమకు కీలక భౌగోళిక వ్యూ హాత్మక స్థావరం అవుతుందని, పాకిస్థాన్‌తో కలిసి భారత్ కు ఎప్పటికప్పుడు సవాలుగా నిలిచేందుకు తమ తదుప రి భవిష్యత్తు ఆర్థిక రాజకీయ సైనిక సమీకరణలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకోవడం కీలకమని చైనా పా లకులు ఓ నిర్ణయానికి వచ్చారు. చైనా తలపెట్టిన ఒన్ బె ల్ట్ రాదారికి తమ మద్దతు ఉంటుందని తాలిబన్ల ప్రతినిధి ప్రకటించారు. ఈ మార్గం గుండా చైనా ఆఫ్రికా, ఆసి యా, యూరప్ దేశాలతో అనుసంధానం కావాలని భావి స్తోంది. చైనానే తమకు ఖచ్చితంగా ప్రధాన భాగస్వామ్య పక్షం అవుతుందని, తమ దేశంలో పెట్టుబడులకు ముం దుకు వచ్చారని తాలిబన్ల అధికార ప్రతినిధి తెలిపారు.

చైనాతో భాగస్వామ్యం తమకు ప్రాథమికంగా, అసాధా రణ రీతిలో కలిసి వచ్చే సదవకాశం అవుతుంది. దేశంలో పెట్టుబడులకు చైనా సిద్ధమైంది. ఇదే క్రమంలో అఫ్ఘన్ పునర్నిర్మాణానికి కూడా సాయం చేస్తుంది. ఇంతకంటే కావల్సింది ఏముందని తాలిబన్ల ప్రతినిధి ఇటలీ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పినట్లు జియో న్యూస్ తెలి పింది. ఇక్కడి వనరులను నిర్వహించడం, ఆధునీకరించ డంతో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌కు కూ డా చైనా దారులు వేస్తుందని ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందని తాలిబన్ల ప్రతినిధి చెప్పారు. తాలిబన్ల లో ఇప్పుడు సరైన మార్పు వచ్చిందని చైనా నమ్మకానికి వచ్చింది. అధునాతన పద్ధతులు పాటించే వీలుంది. దే శంలో సరైన నిర్మాణాత్మక విధానాలను పాటించడం, మ రోవైపు అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర విధానాలకు దిగ డం చేస్తుందని, ఒంటరి వెలివేయించుకునే ధోరణిని పా టించకుండా ఉంటుందని, ఉగ్రవాద శక్తులకు నెలవు కా కుండా ఉండడమే కాకుండా, ఉగ్రవాద శక్తులను ఎది రించేలా వ్యవహరిస్తుందని చైనా ఓ అభిప్రాయానికి వ చ్చినట్లు అక్కడి నుంచి వెలువడ్డ వార్తలతో స్పష్టమైంది.

జోక్యం ఉండదు..స్నేహమే : చైనా

తమ దేశం ఏ దశలోనూ అఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల లో జోక్యం చేసుకోబోదని, ఆ దేశ సర్వసత్తాకతను మన్ని స్తుందని, యావత్తూ అఫ్ఘనీలతో స్నేహాన్ని కొనసాగిస్తుం దని ఇటీవలే చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. అయితే ఆ దేశంలో ఆర్థిక పరి స్థితిని గమనిస్తే అక్కడ సరైన సమ్మిశ్రిత, సకల ప్రాతిని ధ్యపు రాజకీయ నిర్మాణ వ్యవస్థ అవసరం. సమకాలీన విదేశీ, స్వదేశీ పాలసీలను అనుసరించి తీరాలి. ఉగ్రవా ద శక్తులతో ఎటువంటి సంబంధాలు ఉన్నా వాటిని తెం చుకుని తీరాలని చైనా అధికారికంగా స్పష్టం చేసింది.

రష్యాతో కూడా సత్సంబంధాలు

రష్యాతో కూడా సత్సంబంధాలను పెంచుకోవాలని తాలి బన్లు నిర్ణయానికి వచ్చినట్లు ముజాహిద్ తెలిపారు. ఈ ప్రాంతంలో రష్యా ప్రధాన భాగస్వామ్య పక్షం అవుతుం ది. రష్యాను తాము ప్రధాన స్నేహపక్షంగా పరిగణిస్తామ ని స్పష్టం చేశారు.

చైనా పాక్ అఫ్ఘన్ కోణం భారత్‌కు సవాలే

తాలిబన్ల సర్కారుకు అటు పాకిస్థాన్ నుంచి ఇటు చైనా నుంచి అందే సాయం పలు విధాలుగా ఇబ్బందికర పరి ణామాన్ని సృష్టిసుందని భారతదేశం భావిస్తోంది. చైనా అత్యంత వ్యూహాత్మకంగా అఫ్ఘనిస్థాన్‌కు చెందిన భౌగోళి క, భూగర్భ వనరులను తనకు అనుకూలంగా వినియో గించుకోవడం ద్వారా తాను తలపెట్టిన పలు ఆర్థిక వా ణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటుంది. మరో వైపు పాకిస్థాన్ ఈ ప్రాంతంలో తాలిబన్లకు మద్దతు ద్వా రా బలాన్ని సంతరించుకుంటుందనేది ప్రధానంగా జరి గే పరిణామం. అయితే ఇప్పటికీ అఫ్ఘన్‌ను , పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకుని ఉన్న పలు రకాల ఉగ్రవాద శక్తులు, ప్రత్యేకించి ఐసిస్ వంటివి భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని వ్యవహరించే వీలుందని భారత్ భావిస్తోంది. ఖతార్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధులతో ఇటీవలి రోజులలో భారతదేశ రాయబారులు జరుపుతున్న వివిధ స్థాయిల చర్చలలో ఇదే ప్రధాన విషయం అయింది. భారతదేశం నుంచి సరైన గుర్తింపు అవసరం అని తాలిబన్లలో కీలక వర్గం భావిస్తోంది. అయితే అఫ్ఘన్‌ను ఉగ్రవాద శక్తులకు ఆశ్రయవేదికగా చేయనివ్వమనే హామీ ఉంటేనే తాలిబన్ల విషయంలో ఆలోచించడం జరుగుతుందని ఇండియా నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News