Sunday, April 28, 2024

అంతర్జాతీయ విమానాలపై చైనా నిషేధం ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

China Resumes International Flights

భారత్‌కు విమాన సర్వీసులపై తొలగని సందిగ్ధత

బీజింగ్: కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నిషేధించిన అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా పునరద్ధరించింది. అయితే గత నెలలో భారతీయ ప్రొఫెషనల్స్‌కు, వారి కుటుంబాలకు వీసాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ భారత్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై చైనా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దేశంలోకి ప్రవేశించే విదేశీ ప్రయాణికులు నిర్దేశిత హోటళ్లలో 7 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తర్వాత 3 రోజులు హోం ఐసోలేషన్ పాటించాలని నిబంధనలు సడలిస్తూ చైనా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసినట్లు అధికార మీడియో మంగళవారం తెలియచేసింది. కొవిడ్ మహమ్మారి తర్వాత రెండేళ్లకు పైగా నిషేధంలో ఉన్న ప్రయాణ నిబంధనలను సడలిస్తున్నట్లు 125 దేశాలలోని చైనా రాయబారి కార్యాలయాలు ప్రకటించాయి.

ఈ వారంలోనే 2,025 అంతర్జాతీయ విమాన సర్వీసులు చైనాలోకి ప్రవేశించనున్నట్లు చైనా తెలిపింది. 2020 నవంబర్ నుంచి చైనా, భారత్ మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత నెలలోనే చైనా వీసా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలు విమాన సర్వీసులు లేని కారణంగా దేశంలోకి ప్రవేశించలేకపోయారు. అంతేగాక దాదాపు 23,000 మందికి పైగా విద్యార్థులు చైనాలోని కాలేజీలలో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో చదువుకుంటున్నారు. వారంతా కూడా చైనాకు వెళ్లి తిరిగి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నారు. చైనా కోరడంతో ఆ విద్యార్థుల పేర్ల జాబితాను కూడా భారత్ ఇటీవలే సమర్పించింది. కాగా..గత కొద్ది వారాలుగా శ్రీలంక, పాకిస్తాన్, రష్యా, తదితర దేశాలకు చెందిన విద్యార్థులు ప్రత్యేక విమానాలలో చైనా చేరుకుంటున్నట్లున్నారు. అయితే..భారతీయ విద్యార్థుల జాబితాలపై చైనా ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News