Thursday, May 2, 2024

ఘర్షణకు ముందే సరిహద్దుకు చైనా మార్షల్ ఆర్ట్స్ యోధులు..!

- Advertisement -
- Advertisement -

China Sent Martial Artists to LAC Border before Clash

బీజింగ్‌ః ఈ నెల 15న లడఖ్ ప్రాంతంలో ఘర్షణకు కొన్ని రోజుల ముందే సరిహద్దులకు పర్వాతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ యోధులతో కూడిన బృందాలను చైనా పంపినట్టు తెలుస్తోంది. టిబెట్ రాజధాని లాసా వద్ద తనిఖీకి పంపిన వారిలో ఎవరెస్ట్ ఒలింపిక్ టార్చ్ రిలే బృందం కూడా ఉన్నట్టు చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్ పేర్కొన్నది. పర్వాతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ యోధుల బృందం లాసాకు వెళ్లిందని చెబుతున్న మరుసటి రోజే లడఖ్ ప్రాంతంలో ఘర్షణ జరగడం గమనార్హం. అయితే, లాసాకు లడఖ్ 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇరు దేశాల సైనికుల భౌతిక ఘర్షణలో(కాల్పులు జరగలేదు) భారత్ 21మందిని కోల్పోగా, చైనా వైపున ప్రాణ నష్టం గురించి స్పష్టత లేదు. మరోవైపు ఈ సంఘటన సమయంలో లాసా వద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్టు సిసిటివి ఫుటేజ్‌లో వెల్లడైంది.

China Sent Martial Artists to LAC Border before Clash

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News