Thursday, May 2, 2024

అంగారక గ్రహంపై ల్యాండైన చైనా రోవర్

- Advertisement -
- Advertisement -

China’s Tianwen1 spacecraft lands on Mars

 

బీజింగ్: అంగారక గ్రహంపై రోవర్‌ను దించడంలో తమ రోదసీ నౌక విజయవంతమైందని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ(సిఎన్‌ఎస్‌ఎ) తెలిపింది. తియాన్వెన్1 రోదసీ నౌకను 2020 జులై 23న చైనా ప్రయోగించింది. ఆ నౌకలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఏడు నెలలపాటు రోదసిలో ప్రయాణించిన నౌక ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడి కక్షలోకి చేరుకున్నది. కక్షలో తిరుగుతూ రెండు నెలలకుపైగా అంగారక ఉపరితలాన్ని పరిశీలించి ల్యాండింగ్ సైట్‌ను ఎంపిక చేసింది. రోవర్ 240 కిలోల బరువున్నది. దానికి ఆరు చక్రాలు, నాలుగు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. గంటకు 200 మీటర్లు ప్రయాణించే సామర్థమున్నది. రోవర్‌లో ఆరు సాంకేతిక పరికరాలున్నాయి. అంగారకుడిపైకి రోదసీ నౌకను పంపడంలో అమెరికా, రష్యా,ఇయు, భారత్‌తోపాటు తాజాగా చైనా విజయం సాధించాయి. ఆసియన్ దేశాల్లో మొదటిసారి ఆ ఘనత సాధించిన దేశంగా భారత్‌కు పేరున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News