Thursday, May 2, 2024

సిరివెన్నెల మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. “సిరివెన్నెల మనకిక లేరు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గ ద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్పవుతున్నాం..” అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ‘వాగ్దేవి వరప్రసాదంతో తెలుగునాట నడయాడిన విద్యత్కవి సిరివెన్నెల. తన పాటతో మానవతావాదం, ఆశావాదం పొదిగిన అక్షర శిల్పి ఆయన”అని పవన్‌కళ్యాణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

“తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశలా వ్యాపింపచేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల”అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. “సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి”అని జూ.ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తెలిపారు. “తరలిరాని లోకాలకు తరలి వెళ్లిన అక్షర తూటా… మమ్మల్ని ముందుండి నడిపే ఒక వెలుతురు ఆరిపోయింది.. గురువు గారు చేబ్రోలు సీతారామశాస్త్రి శివైక్యం పొందారు… అని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాము”అని త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. “సరస్వతీ పుత్రుడు.. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది”అని మోహన్‌బాబు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Chiranjeevi condolences on Sirivennela Death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News