Friday, May 3, 2024

హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

Chopper with businessman Yusuff Ali makes emergency landing

 

లులూ సంస్థల ఛైర్మన్‌కు తప్పిన ముప్పు

కొచ్చి : ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త ఎంఎ యూసుఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు కేరళలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో అలీ దంపతులు మరో నలుగురు ఉన్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలెట్ దీనిని కొచ్చి సమీపంలోనే అత్యవసరంగా నేలకు దింపారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పన్నన్‌గడ్ ప్రాంతంలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్ అయిన ప్రాంతం అంతా చిత్తడి నేల ఉండటంతో పెను ముప్పు తప్పిందని వెల్లడైంది. ఇంటర్నేషనల్ రిటైల్ గ్రూప్ లులూ గ్రూప్ ఛైర్మన్ అయిన యూసుఫ్ అలీ, ఆయన భార్య, ఇద్దరు సహ ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు కంపెనీ సొంత హెలికాప్టర్‌లో వెళ్లుతున్నారు.

క్రాష్ ల్యాండ్ విషయం తెలియగానే బాధితులను వెంటనే స్థానిక లేక్‌షోర్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని, అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆసుపత్రి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కేరళలో ఉన్న యూసుఫ్ అలీ ఆసుపత్రిలో ఉన్న ఓ బంధువును పరామర్శించేందుకు కొచ్చిలోని తమ నివాసం నుంచి వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. వాతావరణం ఉన్నట్లుండి ప్రతికూలించడం వల్ల, ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో సాంకేతిక లోపం ఏర్పడింది. అత్యంత అనుభవజ్ఞులైన పైలెట్లు సమయస్ఫూర్తితో సురక్షిత ప్రాంతంలో దీనిని ల్యాండ్ అయ్యేలా చేశారని వెల్లడైంది. దేశంలో అతి పెద్ద షాపింగ్ మాల్స్‌లలో ఒకటిగా లులూ గ్రూప్ చలామణిలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News