Sunday, April 28, 2024

పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే, క్రిస్టమస్‌ టైడ్ రెండు రోజు సెలవులను పాటించేందుకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు కూడా క్రిస్మస్, బాక్సింగ్ డేలకు సెలవులు పాటించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం, డిసెంబర్ 25, 26 తేదీలలో క్రిస్మస్, బాక్సింగ్ డేలకు సెలవులు ఉంటాయి. ఈ రోజులు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడ్డాయి. అయితే బ్యాంకులు ఒక్కరోజు మాత్రమే మూతపడనున్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News