Sunday, April 28, 2024

ఎపిలో వర్ష భీభత్సం.. సిఎం జగన్ ఏరియల్ సర్వే

- Advertisement -
- Advertisement -

CM Jagan Aerial Survey of flood hit Areas

అమరావతి: తీవ్ర వాయుగుండంతో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలతో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలు, చేపట్టిన సహాయక చర్యలు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం తదితరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ భాష, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయ పునరావాసం కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని, జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. అనంతరం కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి సిఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిమిత్తం బయలుదేరారు.

CM Jagan Aerial Survey of flood hit Areas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News