Tuesday, May 21, 2024

ఉప్పల ప్రణీత్‌ కు అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫడరేషన్ ఉప్పల ప్రణీత్‌కు గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రణీత్‌ను, అతని తల్లిదండ్రులను సోమవారం సెక్రటేరియట్‌కు పిలిపించుకుని, ప్రణీత్‌ను దీవించారు. కష్టపడి ప్రణీత్‌కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా సిఎం అభినందించారు. చెస్ క్రీడ పట్ల ప్రణీత్‌కు ఉన్న అభిరుచి, కఠోర సాధనే తనను గ్రాండ్ మాస్టర్‌గా తీర్చిదిద్దాయని సిఎం అన్నారు.
భవిష్యత్తులో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా … భవిష్యత్తులో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రణీత్ తల్లిదండ్రులు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడారంగాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగిన తీరే నిదర్శనమని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News