Sunday, April 28, 2024

50 దేశాల్లో కెసిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -
CM KCR Birthday Celebrations in 50 Countries
టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్నారైలు ఘనంగా నిర్వహిస్తారని టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిఆర్‌ఎస్ ఎన్నారైల శాఖ అధ్యక్షులతో మహేష్ బిగాల జూమ్ ద్వారా శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని ఆయన సూచించారు, ఈ సందర్భంగా వివిధ దేశాల్లో జన్మదిన వేడుకలు వివిధ రకాలుగా నిర్వహిస్తున్నారన్నారు. కొన్ని దేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్, గ్రీన్ ఛాలెంజ్‌కు సంఘీభావంగా చెట్లు నాటడం, అనాథలకు సాయం చెయ్యడం, ఎప్పటిలాగే ప్రపంచం అంతటా ఘనంగా నిర్వహించాలన్నారు. అన్ని దేశాల్లో కోవిడ్ పరిమితుల దృష్టా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేసుకోవాలన్నారు.

 

CM KCR Birthday Celebrations in 50 Countries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News