Thursday, May 2, 2024

మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని, సిఎస్‌టి పేరుతో కాంగ్రెస్, జిఎస్‌టి పేరుతో బిజెపి రాష్ట్రాలకు నిధులను ఎగొట్టాయని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు అవుతాయని, బడ్జెట్‌లో కేటాయించిన రూ.3900 కోట్లు కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా కేంద్రం నుంచి ఏటా వచ్చే నిధులు రూ.10 వేల కోట్లు దాటలేదన్నారు. కాంగ్రెస్‌కు బిజెపి తాతలా మారిందని కెసిఆర్ ఎద్దేవా చేశారు. బిజెపి నేతలు నీచపు బుద్ధి మానుకోవాలని హితువుపలికారు. యుపిఎపై విసుగుతోనే ప్రజలు బిజెపికి ఓటు వేశారని, బిజెపి పార్టీ లేకలేక దేశంలో అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బిజెపి దుర్వినియోగం చేస్తోందని కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో వాటా ఇచ్చి తీరాల్సిందేనన్నారు.  దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో బిజెపి ఉందని, కేంద్రం ఏదో ఇస్తుందని చెప్తే నమ్మడానికి మనది చదువురాని రాష్ట్రం కాదన్నారు. పైరవీలు చేసి ఢిల్లీకి చక్కర్లు కొడితే తప్ప మనకు రావాల్సి వాటా రావడం లేదని మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50-60 ఏళ్ల నుంచి పోటీ చేస్తుంటే ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చిందని, తాము పోటీ చేసిన మొదటి సారే అధికారంలోకి వచ్చామని, దేశంలో బిజెపి, కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యాయని, కాంగ్రెస్ ఫెయిల్ అయినందుకే కేంద్రంలో బిజెపి ఉందని, బిజెపోళ్లు గొప్పోళ్లని జనం గెలిపించలేదని, యుపిఎ మీద వచ్చిన విసుగుతో బిజెపిని గెలిపించారన్నారు. బిజెపోళ్లు ఢిల్లీలో కూర్చొని ఏదో మెహర్బాన్నీ చేసినట్టు మాట్లాడుతున్నారని, రాజ్యాంగంలో టాక్స్ అనేదానికి ఒక పద్ధతి, విభజన ఉన్నాయని కెసిఆర్ తెలియజేశారు.  దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక అవసరాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, పౌల్ట్రీ రైతులకు పక్క రాష్ట్రాలు మన కంటే ఎక్కువ ఇన్సెంటీవ్స్ ఇస్తున్నాయని, పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి 25 లక్షల మంది బతుకుతున్నారన్నారు.

CM KCR comments on PM Modi in Telangana Budget  
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News