Sunday, April 28, 2024

ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కాకూడదు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

చేర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. చేర్యాలలో భారత రాష్ట్ర సమితి శనివారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కాకూడదని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదని తెలిపారు. అభ్యర్థుల గుణగణాలు ప్రజలు గమనించాలని కోరారు.

తెలివితో ఓటు వేస్తేనే… తెలివైన ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు అన్నారు. రాష్ట్ర తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలని ఆయన పేర్కొన్నారు. భారాస పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్న సిఎం పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఏం చేసిందో గమనించాలని పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఎంతో పోరాటం చేసి తెలంగాణను మళ్లీ సాధించుకున్నామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News