Wednesday, May 8, 2024

భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting on Heavy Rains

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఎగువరాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను సిఎం కెసిఆర్ అప్రమత్తం చేశారు. వరదలు, సహాయక చర్యలపై అధికారులతో సిఎం సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. పరివాహక ప్రాంతాల్లో అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సిఎస్ కు కెసిఆర్ ఆదేశించారు.

CM KCR Review Meeting on Heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News