Thursday, May 2, 2024

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సమీక్షించనున్న సిఎం

- Advertisement -
- Advertisement -

CM KCR review on Telangana High Court orders tomorrow

హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆధార్ కార్డు అడగొద్దంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిఎం కెసిఆర్ శనివారం ఉన్నస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సిఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులతో భేటీ కానునున్నారు. ఈ సమావేశంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అయితే ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా అందలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు ఆదేశాల కాపీ అందిన తర్వాత కూలంకషంగా ప్రభుత్వం చర్చించనుంది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై కెసిఆర్ చర్చించనున్నారు. విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్లను కొనసాగించడంపైనా సమీక్షించే అవకాశం ఉంది. సిఎం కెసిఆర్ రెవెన్యూ, న్యాయశాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News