Monday, April 29, 2024

‘చట్టాలు రాత్రికి రాత్రే తీసుకొచ్చినవి కాదు’: ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi urges Opposition not to mislead farmers

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, ఎన్నో ఏళ్ల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగిన తర్వాత రూపొందించామని చెప్పారు. మధ్యప్రదేశ్ లో కిసాన్ కల్యాణ్ పథకం ప్రారంభించిన ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతిపక్ష పార్టీ కూడా కొత్త వ్యవసాయ చట్టాలు తెస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని పిఎం మోడీ సూచించారు. కనీస మద్దతు ధరపై రైతలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. మద్దతు ధరపై విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిపుణులు కూడా కొత్త చట్టాలు తీసుసకురాలాలన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిపోర్టును విపక్షాలు పట్టించుకోలేవని గుర్తుచేశారు. ఎంఎస్ పి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని విపక్షాలకు ప్రధాని మోడీ చేతులు జోడించి అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News