Tuesday, May 7, 2024

గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

పిట్లం: గిరిజన జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకుని వచ్చిన సిఎం కెసిఆర్ అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శనివారం పిట్లం మండలంలోని గౌ రారం తాండలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 9 ఏండ్ల పాలనలో ఎంతో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ భారతదేశంలో యావత్ రాష్ట్రంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపేందుకు విశేష కృషిచేస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సిఎం కెసిఆర్ అని గిరిజన జీవితాల్లో గణనీయమైన మార్పు కోరుతూ వారి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు.

గిరిజన జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ గిరిజన బాంధవుడుగా గిరిజనుల మనస్సులో చిరకాలం నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. సాంప్రదాయ దుస్తులను, సాంప్రదాయ నృత్యాలతో బాలికలు నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే సైతం వారితో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో సాయాగౌడ్, ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లకా్ష్మరెడ్డి, అన్నారం వెంకట్రాం రెడ్డి, లక్ష్మీబాయి బాబుసింగ్, జుక్కల్ నియోజకవర్గంలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News