Thursday, May 2, 2024

ఫిఫ్టీకా

- Advertisement -
- Advertisement -

1971 జనవరి 1కి ముందు జన్మించి 2021 జనవరి 1కి 50ఏళ్లు నిండిన వారికి ముందుగా టీకా

కటాఫ్ తేదీని ప్రకటించిన కేంద్రం 
తొలి రోజు నార్సింగ్ పిహెచ్‌సి, గాంధీ కేంద్రాలతో పిఎం మోడీ ఇంటరాక్ట్ 
పూణే నుంచి 14 సిటీలకు ప్రత్యేక విమానాల్లో వ్యాక్సిన్ తరలింపు 
రాష్ట్రంలో ఈనెల 16వ తేదిన 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం

టీకా పంపిణీపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR to Review meeting on Vaccine on Monday

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. అయితే ఇప్పటికే 2.95 లక్షల హెల్త్ కేర్ వర్కర్ల వివరాలను కోవిన్ సాప్ట్‌వేర్‌లో నమోదు చేయగా, వ్యాక్సినేషన్ 1లోని మిగతా మూడు కేటగిరీలను గుర్తించే ందుకు వైద్యశాఖ కసరత్తులు చేస్తుంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్ల లోపు కోమార్పిడ్ కండీషన్ వ్యాధిగ్రస్తుల వివరాలను ఇప్పటికే 80 శాతం వరకు సేకరించగా, 50 ఏళ్ల పై బడిన వారిని గుర్తించే ప్రక్రియనూ అధికారులు మొదలు పెట్టారు. ఈ కేటగిరి జాబితాను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేది ఆధారంగా తయారు చేయనున్నారు. 1971 జనవరి 1 కంటే ముందు పుట్టినోళ్లు మాత్రమే ఈ 50 ఏళ్ల పై కేటగిరిలో టీకాను తీసుకునేందుకు అర్హులని కేంద్రం తేల్చి చెప్పింది. అంటే 1971 జనవరి 1 కంటే ముందు నుంచి ఈ ఏడాది జనవరి 1వ తేది లోపు సరిగ్గా 50 ఏళ్ల వయస్సు లేదా అంతకు మించి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ కేటగిరీ వారిని కూడా ఎంపిక చేసే పనిలో వైద్యశాఖ నిమగ్నమైంది. దీనిలో భాగంగా పంచాయితీ, మున్సిపల్, రెవెన్యూతో పాటు ఇతర శాఖలతో సమన్వయమై ఈ డేటాను సేకరిస్తున్నట్లు ఆరోగ్యశాఖలోని ఓ ఉన్నతాధికారి మన తెలంగాణకు తెలిపారు.
తొలి రోజు నార్సింగ్ పిహెచ్‌సి, గాంధీ హాస్పిటల్స్ కేంద్రాలతో పిఎం మోడీ ఇంటరాక్ట్…
వ్యాక్సినేషన్ 1 కార్యక్రమం వచ్చే శనివారం నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే మన రాష్ట్రంలో కూడా అదే రోజు టీకా పంపిణీ మొదలు కానుంది. ఈక్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పిఎం మోడీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో తొలి రోజు రెండు కేంద్రాల్లో జరిగే పంపిణీని వర్చువల్ విధానంలో పర్యవేక్షించనున్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్, నార్సింగ్ పిహెచ్‌సిలోని టీకా పంపిణీ విధానంపై పిఎం మోడీ అక్కడి సిబ్బందితో నేరుగా మాట్లాడనున్నారు. ఈమేరకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
పూణే నుంచి 14 నగరాలకు టీకా సరఫరా….
ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనిక్ భాగస్వామ్యంతో పూణేలోని సీరమ్ సంస్థ కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ వ్యాక్సిన్‌ను తొలి విడత దేశ వ్యాప్తంగా 14 పట్టణాలకు తరలించనున్నారు. ఈమేరకు ప్రత్యేకమైన విమానాలను కూడా సిద్ధం చేసినట్లు సెంట్రల్ ఆఫీసర్లు పేర్కొన్నారు. అయితే పూణే నుంచి మన రాష్ట్రానికి తొలి విడత 6.5 లక్షల కొవిషీల్డ్ డోసులు రానున్నాయి. ఇవి హైదరాబాద్ ఎయిర్‌ఫోర్డ్‌కు రాగానే అక్కడ్నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కోఠి సెంట్రల్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ్నుంచి జిల్లాల్లోని వ్యాక్సిన్ సెంటర్లకు పంపిప్తామని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈనెల 16వ తేదిన 139 సెంటర్లలో వ్యాక్సినేషన్….
రాష్ట్రంలో ఈనెల 16వ తేదిన 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే వీటిలో 40 ప్రైవేట్ సెక్టార్ , 99 ప్రభుత్వ కేంద్రాలున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఒక్కో సెంటర్‌లో వంద మంది చొప్పున మొత్తం 13వేల 900 మందికి కొవిషీల్డ్ టీకాను ఇవ్వనున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో తొలి రోజు 3 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, కొత్తగూడెంలో 4, హైదరాబాద్‌లో ప్రైవేట్, పబ్లిక్ హెల్త్ కలిపి 13, జగిత్యాల 2, జనగాం 2, భూపాలపల్లి 3, గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ ప్రైవేట్, పబ్లిక్ హెల్త్ కలిపి 4, ఖమ్మం ప్రైవేట్, పబ్లిక్ హెల్త్ కలిపి 6, కొమరం భీం 3, మహబూబాబాద్ 4, మహబూబ్‌నగర్ ప్రైవేట్, పబ్లిక్ హెల్త్ 4, మంచిర్యాల 2(పబ్లిక్, ప్రైవేట్ హెల్త్), మెదక్ 2, మేడ్చల్ 11, ములుగు 2, నాగర్‌కర్నూల్ 2, నల్గొండ 3, నారాయణపేట్ 3, నిర్మల్ 3, నిజమాబాద్ 6, పెద్దపల్లి 4, సిరిసిల్లా 4, రంగారెడ్డి 9, సంగారెడ్డి 6, సిద్ధిపేట్ 3, సూర్యాపేట్ 3, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్‌లో 6, యాదాద్రి భువనగిరిలో మూడు కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. మరోవైపు ఎక్కడి వారికి అక్కడే వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ధిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగా తొలి రోజు 139 కేంద్రాలు ప్రారంభించి 18వ తేది నుంచి 1200 కేంద్రాల్లో పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు రా్రష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, వంద బెడ్లు కలిగిన ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్‌లోనూ వ్యాక్సిన్ పంపిణీ జరగనుందని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం క్రమక్రమంగా టీకా పంపిణీ కేంద్రాలను దాదాపు 1500 కేంద్రాలకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. అంతేగాక పిహెచ్‌సి, సిహెచ్‌సిల్లోనూ టీకా స్టోర్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
టీకా పంపిణీ ఏర్పాట్ల పై నేడు సిఎం సమీక్ష…..
రాష్ట్రంలో టీకా పంపిణీపై నేడు(ఆదివారం) సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. టీకా కేంద్రాలు, లబ్ధిదారుల వివరాలు, డోసుల తరలింపు వంటి అంశాలపై ఆయన పలు సలహాలు, సూచనలు చేయనున్నట్లు సమాచారం.

CM KCR to Review meeting on Vaccine on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News