Monday, May 6, 2024

సీతమ్మ ప్రాజెక్టుకు త్వరలో సిఎం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలో సీతమ్మ బహుళార్థ
ప్రాజెక్టుకు త్వరలో భూమి పూజ చేయనున్న సిఎం
ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన సిఎంఒ కార్యదర్శి
స్మితాసబర్వాల్, జలవనరుల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్
భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశాలు

మన తెలంగాణ/మణుగూరు: సీతమ్మ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ భూమిపూజకి త్వరలో సిఎం కెసిఆర్ రానున్నరని సిఎంఒ కార్యదర్శి స్మీతాసబర్వాల్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. అశ్వాపురం మండల పరిధిలోని అ మ్మగారిపల్లి గ్రామం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్ధ సాదక ప్రాజెక్ట్ ప్రతిపాధిత ప్రాంతాన్ని ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం సాగునీటి అవసరాలే లక్షంగా బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టిందని, దానిలో భాగంగానే అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి 2022 సెప్టంబర్ నాటికి పనులు పూర్తిచేసేందుకు ప్రణాళిక రుపోందించిదని అన్నారు. త్వరలో సీతరామ ప్రాజెక్ట్ మొదటి దశ పంపుహౌస్ మోటార్లు ఏర్పాటుకు, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సిఎం కేసిఆర్ రానున్నారని తెలిపారు.

మార్చి మొదటి వారంలో కాంక్రీట్ పనులు చేపట్టాలని, నిర్మాణానికి కావల్సిన సామాగ్రిని సిద్ధ్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వార దుమ్ముగూడెం ఆనకట్ట నుండి బీజి కొత్తురు వరకు 10.5కీలోమిటర్లు గ్రావిటీ ద్వార ఎత్తిపోయడం జరుతుందని తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 3200 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, అధికారులు త్వరగతిన భూసేకరణ పక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిదంగా సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పంపుహౌస్‌కు 6 మొటార్లు ఏర్పాటుకుగాను ఇప్పటికే 5 మోటార్లు ఏర్పాటు చేశామని, నెలాకరు నాటికి మిగిలిన మోటారును ఏర్పాటు చేసి డ్రైరన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీయం ముఖ్యసలహాదారులు పెంటారెడ్డి, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, ఐటిడిఏ పిఓ గౌతమ్ కుమార్, అదనపు కలెక్టర్‌లు వెంకటేశ్వర్లు, అనుదీప్, ఓఎస్డీ నాగేంద్రరావు, ప్రాజెక్ట్ సీఈ వెంకటక్రిష్ణ, ఈఈ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR to Inaugurate Seethamma Project Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News