Monday, April 29, 2024

టార్గెట్ 100

- Advertisement -
- Advertisement -

ఇందుకోసం నేతలు అంశాల కార్యాచరణ పాటించాలి ఈ లక్షసాధనకు నియోజకవర్గానికి ఇద్దరు బాధ్యత
వహించాలి పల్లెనిద్ర వంటి కార్యక్రమంతో జనంతో కావాలి మన ప్రభుత్వం అధికారంలోకి
రావడమనేది పెద్ద టాస్క్ కాదు మునపటికంటే ఎక్కువ సీట్లు రావాలనేదే ప్రాధాన్యత అంశం బావి
తవ్వడం అనే రాజకీయం నేటి కాలానికి సరిపోదు అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశాన్ని
ప్రగతిపథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం పారదర్శకంగా పనిచేస్తున్నాం కాబట్టే పెట్టుబడులు
వస్తున్నాయ్ ఎపి తలసరి ఆదాయం రూ.2.19,518 ఇది మనకంటే లక్ష తక్కువ తెలివి ఉంటే బండమీద
నూకలు పుట్టించుకోవచ్చు మనం అమలు చేస్తున్న పథకాలు అమలుచేస్తే దివాళా తీస్తామంటున్నది మహారాష్ట్ర
మరి తెలంగాణ ఎందుకు దివాళా తీయలేదు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణది అగ్రస్థానం మే 4న
ఢిల్లీ కార్యాలయం ప్రారంభం.. జూన్ 1న అమరవీరుల స్తూపం విష్కరణ రూ.6లక్షల కోట్లకు
చేరుకోనున్న తెలంగాణ బడ్జెట్ భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్

గుణాత్మక రాజకీయాలతో దేశంలో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బిఆర్‌ఎస్ పార్టీ ముందుకొచ్చిందని, భారత దేశానికి బిఆర్‌ఎస్‌ను ఒక వెలుగుదివ్వెగా తీసుకుని పార్టీ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మే నెల 4న ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం, జూన్ 1న అమరుల స్మారక ఆవిష్కరణ కార్యక్రమం, అదే విధంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకోనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. పార్లమెంటరీ పంథాలో దేనినైనా సాధించవచ్చనిప్రపంచానికి చాటిచెప్పామని స్పష్టం చేశారు. పా ర్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువా రం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రతినిధులనుద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలోనే తాను త్వరలోనే ఒక్కో ఎంఎల్‌ఎతో కలసి మాట్లాడుతానన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందు కు ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ పార్టీ 22 ఏండ్ల అనతికాలంలోనే తన స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించమే కాకుండా దేశానికే ఆదర్శంగా ప్రజా పాలనను అందిస్తూ ప్రగతి పథాన ముందుకు సాగుతున్నదనీ, నేడు దేశ ప్రజల ఆ కాంక్షలను నెరవేర్చేదిశగా బిఆర్‌ఎస్‌గా గుణాత్మ క మార్పుచెంది ఒక చారిత్రక దశలోకి ప్రవేశించిన సందర్భంలో 23వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవ డం మనందరికీ

గర్వకారణమన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత పార్లమెంటరీ పంథాలో గులాబీ జండానెత్తుకుని తెలంగాణ బిడ్డలు అనుసరించిన ప్రజాస్వామిక ఉద్యమ కార్యాచరణ అత్యంత క్లిష్టమైన తెలంగాణ రాష్ట్రం సాధన లక్ష్యాన్ని చేరుకుని, తొమ్మిదేండ్ల అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దేశానికే ఆదర్శంగా ముందుకు నడిపిస్తున్నదని తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్న అధినేత, సిఎం కెసిఆర్ తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు చేరుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపి కే. కేశవరావు ప్రసంగం తో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. అనంతరం బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కెసిఆర్ ప్రసంగం కొనసాగింది.

చివరిగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టడంతో మొదటి సెషన్ పూర్తయింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నభోజనాలు ముగిసిన అనంతరం..మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైంది. మంత్రి కెటిఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాలను ఆమోదించేందుకు అధ్యక్షుల అనుమతితో నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా.ఎంఎల్‌సి రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటగా తీర్మానాలను బలపరుస్తూ ప్రసంగించారు. అనంతరం. ఆందోల్ ఎంఎల్‌ఎ చంటి క్రాంతి కిరణ్, ఎంఎల్‌సి ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంత్రి జగదీశ్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మానకొండూరు ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్‌లు కెటిఆర్ ప్రవేశ పెట్టిన రాజకీయ తీర్మానాలపై ప్రసంగించి ఆమోదించాలని సభను కోరారు.

ఈ సందర్భంగా చప్పట్లతో సభ ఆమోదం తెలిపింది. అనంతరం దళితబంధు పథకం, 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నామకరణం, రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటు సహా దళితులకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ పై తీర్మానాలను మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్‌సి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాలను బలపరుస్తూ సభను ఆమోదించాలని కోరుతూ ఎస్‌సి డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న ఎంఎల్‌ఎ సండ్రవెంకట వీరయ్య, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంఎల్‌సి మధుసూధనాచారి, ఎంఎల్‌ఎ విప్ బాల్క సుమన్‌లు సభలొ ప్రసంగించారు. కాగా సభ చప్పట్లతో తీర్మానాలను ఆమోదించింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తీర్మానాలన బలపరుస్తూ ప్రసగించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌సిలు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులనుద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించారు.
అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతిపథంలో నిలిపేలా ముందుకు…
రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినామని తెలిపారు. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం.
రైతులను వ్యవసాయాన్ని ఆదుకుంటాం :
వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయాన్ని ఆదుకుంటామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పునరావాస సాయం అందచేస్తామని తెలిపారు. రైతుల ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతిననీయం. రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. రాళ్లవానలతో పంటల నష్టం గురించి మీమీ జిల్లా కలెక్టర్లతో నివేదికలు తెప్పించుకోండన్నారు. కేంద్రం చేసే సాయం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా వుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులకు కేంద్రం మీద ఆశలు ఏనాడు లేవని, అవసరానికి అక్కెరకొచ్చే పరిస్థితి కేంద్రానికి లేదు కావట్టే రాష్ట్ర ప్రభుత్వమే ఎంత కష్టమైనా నష్టమైనా భరించాలని నిర్ణయించుకున్నదని స్పష్టం చేశారు.

తెలంగాణ రైతు కాలుకు ముల్లుగుచ్చుకుంటే తీయడానికి సిధ్దంగా వున్నదన్నారు. ఎకరాకు 10 వేల రూపాయల పునరావాస సాయం ప్రకటించడం భారత దేశ వ్యవసాయ రంగంలోనే మొట్టమొదటిసారి.ధాన్యాన్ని కూడా గింజలేకుంటున్న కొంటున్న ప్రభుత్వం కూడా మనదేనని తెలిపారు. తెలంగాణ పచ్చబడ్డది ..పల్లెలు సల్లబడ్డయి..పోయిన వలసలు తిరిగి వస్తున్నాయన్నారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేసాను. కానీ నాటి పరిస్థితిని పరిశీలిస్తే ఆ రాష్ట్రాలకన్నా తెలంగాణ ఎంతో ముందంజలో ఉందన్నారు. మన పార్టీ రైతు పార్టీ గా మారిందని, మనం ఇక రైతు రాజ్యాన్ని నడిపించుకుందామన్నారు.
మహారాష్ట్ర బడ్జెట్ ఎంతకూ ఎదగకపోవడానికి కారణం
అక్కడి పాలకులు విజన్ లేకపోవడమే…
మహారాష్ట్ర బడ్జెట్ ఎంతకూ ఎదగకపోవడానికి కారణం అక్కడి పాలకులు విజన్ లేకపోవడమేనన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువేనని తెలిపారు. తెలంగాణ జిఎస్‌డిపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతానికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలన్నారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామన్నారు. మార్క్ ఫెడ్‌కు ఈ మేరకు ఆదేశాలిస్తామని తెలిపారు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు ? అని ప్రశ్నించారు.
తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం
తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పాలన కానీ సామాజిక రాజకీయ శాంతి భధ్రతల పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా వున్నాయన్నారు. అందుకే విశ్వవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నయని తెలిపారు. మన మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయన్నారు. ఎపి తలసరి ఆదాయం రూ. 2,19,518.

ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ, ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయన్నారు. 2021-2022 కు ముందు జిఎస్‌టి ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నం. కానీ 54 వేల కోట్లు సాధించగలిగామన్నారు. తెలంగాణ రోజు రోజుకూ ఆర్థిక వనరులు పెరుగుతున్నాయనడానికి జిఎస్‌టి వసూళ్లు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి సహా సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామన్నారు తెలంగాణలో పూర్తిస్తాయి సాగునీటి వసతులు పూర్తవుతాయని తెలిపారు.
తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు.
తెలివి వుంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రచార సాధనాలను మెరుగు పరుచుకోవడం, పార్టీ శ్రేణులతో మమేకమవ్వడం, వారి కష్ట సుఖాలను తెలిసుకోని కలుపుకపోవడం చేయాలన్నారు. ఆత్మీయ సభల నిర్వహణ నియోజక వర్గాలవారీగా సభలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. అందుకు పార్టీశ్రేణులకు, వర్కింగ్ ప్రెసిడెంటు కెటిఆర్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలమంది ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు తనకు సమాచారమున్నదన్నారు. మనం పనులు బాగా చేస్తున్నాం కానీ ప్రచారం లేదని అంటున్నారన్నారు. మన శ్రేయోభిలాషులు. చేసిన పని చెప్పుకోవాలె, మీరు కూడా నావోతిగనే వుంటెట్ల..? అని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని తెలిపారు.
ప్రచార వ్యవస్థలను ఎవరికివారుగా మెరుగుపర్చుకోవాలి
ప్రచార వ్యవస్థలను ఎవరికివారుగా మెరుగుపరుచుకోవాలే అని అన్నారు. ప్రతినిత్యం ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు చేర్చేలా చర్యలు చేపట్టండని పిలుపునిచ్చారు. మన ప్రగతి గురించి సానుకూలంగా పాజిటివ్ గా ఆలోచించే మీడియాను పత్రికలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరమున్నదన్నారు. మన పదేండ్ల పాలనలో వొక్కో గ్రామానికి పథకాల రూపంలో ఎన్ని డబ్బులు అందినాయని, లబ్ధిదారులకు ఎట్లా అవి ఉపయోగపడుతున్నాయనే విషయంపై దృష్టి సారించండని తెలిపారు. అక్కడో ఇక్కడో కేడర్ లో అసంతృప్త్తిని వుంటే వాటిని తగ్గించే చర్యలు చేపట్టండన్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామన్న దీమా కనబర్చారు.
పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి.
పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారన్నారు. మనం చేసినట్టు ప్రజలకు అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రమూ చేస్తలేదని తెలిపారు. బస్తీల వారిగా వార్డుల వారీగా పల్లెల్లో పట్టణాల్లో నియోజకవర్గాల వారిగా తిరిగి సమీక్షలు నిర్వహించండని, నివేదికలు పార్టీ కార్యాలయానికి పంపండన్నారు. రాబోయే పదిరోజుల్లో ప్రజలతో సమీక్ష కార్యక్రమం ముగియాలని, తద్వారా తగిన వ్యూహం తో ప్రజల్లోకి వెల్లండని ఆదేశించారు.
అవినీతికి తావివ్వొద్దు… పథకాల్లో పారదర్శకత కొనసాగించాలి
ముఖ్యమైన పథకాల్లో పారదర్శకంగా కొనసాగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. 3 లక్షల గృహలక్ష్మి పథకం, దళితబంధు అమలు, గొర్రెల పంపిణీ, పోడుభూముల పట్టాలు, 58,59 జివొల ప్రకారం క్రమబద్దీకరణ ఇవి సామాన్యులకు పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలన్నారు. వాటిని అత్యంత క్రమశిక్షణతో అమలు చేయించాల్సి వుంటుందని తెలిపారు. ఎటువంటి తేడాలు రానివ్వద్దు. వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. .
నోటరీ భూముల క్రమబద్దీకరణపై కొత్త సచివాలయంలో సంతకం
పేదలకు పంచేందుకు గతంలో జాగాలు సమీకరిస్తే వాటిని వెంటనే పంపిణీ చేయాలని, హైద్రాబాద్ లో నోటరీ భూములను కూడా క్రమబద్దీకరిద్దామని, కొత్త సెక్రటేరియట్‌లో ఇందుకు సబంధించిన ఫైళ్ల మీద సంతకం చేస్తానని పేర్కొన్నారు. 3 లక్షల రూపాయలిచ్చే గృహలక్ష్మి పథకం కోసం త్వరలోనే విధివిధానాలు విడుదలవుతాయన్నారు సొంత జాగాలున్నవాళ్లకు, ప్రభుత్వం ఇచ్చిన భూముల పట్టాలున్న వాళ్లకుకూడా కట్టిస్తమన్నారు. ఇంకా కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే చేసి నివేదికలు ప్రభుత్వానికివ్వండన్నారు. .ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణమే వాటిని అర్హులైన పేదలకు పంచుదామని, తద్వారా వాళ్లు ఇండ్లుకట్టుకుంటారన్నారు. ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేయండని, మన శాసనసభ్యులు లేని చోట జడ్‌పి ఛైర్మన్లు, ఎంపిలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలన్నారు. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు, మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమని పేర్కొన్నారు. .
ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్…
ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్… దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదని
రాబోయే ఎన్నికల్లో తప్పక ఘన విజయం సాధించి తీరుతామన్నారు బిఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవొచ్చన్నారు.
నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గం. 12.45 కల్లా అక్కడికి చేరుకొండన్నారు. పుష్కర అంశలో ప్రారంభం జరుగుతుందని తెలిపారు. గం. 1.58 నుంచి గం. 2.04 వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు పోవాలన్నారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్ వుంటుందని. ఆతర్వాత లంచ్ చేసి కార్యక్రమం ముగుస్తుందని వెల్లడించారు. మెయిన్ గేట్ గుండా సిఎం, మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎలకు ఉద్దేశించిందన్నారు. 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించిందని పేర్కొన్నారు. కాగా, సౌత్ ఇస్ట్ జనరల్ విజిటర్స్ కు ఉద్దేశించిందన్నారు.
బీసీ జన గనణ చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నది..?
బిసి జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నది..? అని ప్రశ్నించారు. తక్షణమే జన గనణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ యుద్దాల సమయంలో కూడా జన గణన ఆపలేదు, మరి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు ఆపుతున్నదో ప్రజలకు చెప్పాలన్నారు. దీనిని కూడా మత విద్వేషాలతో కాలయాపన చేస్తూ పక్కకు పెడుతున్నారని విమర్శించారు.
అంబేద్కర్ మహాశయుడు విశ్వమానవుడు
అంబేద్కర్ మహాశయుడు విశ్వమానవుడు అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం తన దార్శనికతతోనే సాధ్యం అయిందన్నారు. ఇదే విషయాన్ని తాను పలు మార్లు చెప్పినా కూడా రాజ్యాంగ రచన సందర్భంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వచ్చినపుడు అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం కూడదు అని చెప్పిన దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఆలోచనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధనకు మూలమైందన్నారు. అందుకే అంబేద్కర్ స్పూర్తివంతమైన మూర్తిని నిలబెట్టకున్నామని తెలిపారు. సచివాలయానికి కూడా వారి పేరుపెట్టుకుని వారి ఆశయాల సాధారణ దిశగా ముందుకు పోతున్నామన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడంతో మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మరింతగా ఇనుమడించిందన్నారు. ప్రజలు నాయకుల లక్ష్యశుద్ది ని పరిశీలిస్తారన్నారు. చిల్లర మల్లర రాజకీయ విమర్శకులకు పనిచేసే మనం ప్రభావితం కావొద్దన్నారు.
దళితబంధు సామాజిక పెట్టుబడి
దళిత బంధు కు పెడుతున్న పెట్టుబడి అది వ్యక్తిగతంగా కాకుండా సమాజ సంపదను పెంచే సామాజిక పెట్టుబడిగా మారుతుంది. ప్రభుత్వం పంచుతున్న డబ్బు గ్రామాల్లో తిరిగి సమాజానికి చేరుతుంది. ఇదే స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. రాబోయే కాలంలో 6 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ పెరుగుతందనడంలో అతిశయోక్తి కాదు. ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతనే వుంటది. దీని మీద విద్యార్ధులు రీసెర్చ్ స్టడీ చేయాల్సిన అవసరమున్నదన్నారు. దళితుల్లో వజ్రాలను వెలికితీసే పథకం దళిత బంధు పథకం. నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతున్నదన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ ఫండ్ రూ.1250 కోట్లు
మన పార్టీ ఫండ్ నేటికి 1250 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇందులో 767 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశామని తెలిపారు. తద్వారా నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తోందని వెల్లడించారు. దీంతో పార్టీని నడపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రచారం, మౌలిక వసతుల కల్పన కోసం తదితర ఖర్చులు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగాపార్టీ ఆర్థిక వ్యవహారాలపై తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్టీ ఆర్థిక వ్యవహారాలను అధ్యక్షులే చూసుకుంటారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలను తెరవడం, కోశాధికారి అధ్యక్షునికి సహాయకుడిగా వ్యవహరించడం, పార్టీ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థల ఏర్పాటు తదితర తదితర పార్టీ ఆర్థిక వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ చప్పట్లతో ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News