Wednesday, May 1, 2024

చినజీయర్ స్వామి ఆశ్రమంలో సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR visits Chinjiyar Swami Ashram

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ‘ఊరూరా జమ్మి, గుడి గుడికి జమ్మి’ కార్యక్రమంలో భాగంగా స్వామితో కలిసి జమ్మి చెట్టును నాటిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కెసిఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను శాలువలతో చినజీయర్ స్వామి సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందించి వారిని ఆశీర్వదించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సిఎం కెసిఆర్ సహపక్తి భోజనం చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హరితహారం స్ఫూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం చేపట్టిన.. ‘ఊరు ఊరుకు జమ్మి.. గుడి గుడి కి జమ్మి‘లో భాగంగా, కుటీర ప్రాంగణంలో చినజీయర్‌తో కలసి సిఎం కెసిఆర్ జమ్మి మొక్కను నాటారు. స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతో చేస్తున్నారని అభినందిస్తూ, సంతోష్ కుమార్ కృషిని చినజీయర్ స్వామికి సిఎం పరిచయం చేశారు.

హరిత హారం కార్యక్రమం సాధిస్తున్న పురోగతిని, చేరుకున్న లక్ష్యాన్ని స్వామికి వివరించారు. మొక్కలు నాటడంతో పాటు జమ్మి మొక్కను నాటే ఆలోచన గొప్పదని ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌ను చినజీయర్ స్వామి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ శోభమ్మ దంపతులతో పాటు, ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్, టిటిడి బోర్డు సభ్యుడు, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కావేరి సీడ్స్ భాస్కర్ రావు, శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్, పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్‌డిఒ చంద్రకళ, ఆశ్రమ నిర్వాహకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News