Saturday, May 4, 2024

సిఎం కెసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 30 వ తేదిన సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో విజయవంతం చేసే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయం పని చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసి జిల్లా ఆధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30న సిఎం కెసిఆర్ పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభోత్సవం, కుమ్రంభీం, కోట్నక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ఉన్నందున శాఖల అధికారులు సమన్వయంతో పర్యటన విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని అన్నారు.

అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్ వాహానాలను సిద్ధంగా ఉంచాలని, సంబంధిత శాఖల అధికారులు ప్రవేశ పాసులు తీసుకొని జిల్లా అధికారులకు మధ్యాహ్న భోజన వసతి, ప్రముఖులకు అల్పాహారం, అవసరమైన ఏర్పాట్లు, ఆయా ఆధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉ న్నతాధికారులు రానున్నందున అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బహిరంగ సభ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్లను చేపట్టాలని, ఎస్పీఎంలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని, జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల వారిగా ఆరుగులు చొప్పున లబ్ధ్దిదారులను ఎంపిక చేసి పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

మీడియ పాసులు, ప్రోటోకాల్, ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాలని, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పుష్ఫాలంకరణ ఏర్పాట్లపై ఉద్యానవన శాఖ అధికారులు బాధ్యత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వాహన శ్రేణి, ఇతర వాహనాలు, ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికబద్ధ్దంగా వ్యవహరించాలని తెలిపారు. సీఎం పర్యటన సందరన్భంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్‌డిఓ రాజేశ్వర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News