Sunday, May 5, 2024

ఇది హిందీని బలవంతంగా రుద్దడమే

- Advertisement -
- Advertisement -

చెన్నై: బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు హిందీ పేర్లను పెట్టడంపై తమిళనాడులో అధికార డిఎంకె పార్టీ శుక్రవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీన్ని బలవంతంగా హిందీని రుద్దడంగా పేర్కొన్న ఆ పార్టీ, భారత దేశ భిన్నత్వాన్ని దెబ్బతీయడానికి నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నంగా పేర్కొంది. ఇకపై బిజెపి, ప్రధాని నరేంద్రమోడీలకు తమిళ పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు లేదని డిఎంకె అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మండిపడ్డారు. ‘ వలసపాలనను రద్దు చేయడం పేరుతో అదే పాలనను తిరిగి తీసుకు వస్తున్నారు. భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,

భారతీయ సాక్ష బిల్లుల పేరుతో కేంద్రం భారత దేశ భిన్నత్వాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది భాషా సామ్రాజ్యవాదం తప్ప మరోటి కాదు’ అని స్టాలిన్ ఓ ట్వీట్‌లో మండిపడ్డారు. ఇది ఇండియా ఐక్యతా పునాదినే అవమానపరచడం. ఇకపై బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీకి ఇకపై తమిళపదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు లేదంటూ స్టాలిన్ మండిపడ్డారు.హిందీ వ్యతిరేక ఉద్యమలు మొదలుకొని మా భాషా గురింతపును కాపాడుకోవడం దాకా తాము గతంలో హిందీని బలవంతంగా రుద్దడమనే తుపానులను ఎదుర్కొని నిలబడ్డామని, భవిష్యత్తులో కూడా తిరుగులేని కృతనిశ్చయంతో ఆ పని మళ్లీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News