Thursday, August 7, 2025

కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకే మహిళాశక్తి: కలెక్టర్ రిజ్వాన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట కల్యాణి స్వయం సహాయక సంఘానికి చెందిన మంజుల అనే మహిళ రూ.2లక్షల రుణంతో ఏర్పాటు చేసిన ‘వనిత’ టీ స్టాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ‘వనిత’ టీ స్టాల్స్ ప్రారంభించిన మహిళలు రోజుకు కనీసం రూ.3వేలు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ స్టాల్స్‌లో భోజనం, చేతి ఉత్పత్తులు వంటి వస్తువులను అమ్ముతారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ, ఎల్‌డీఎం, మునిసిపల్ కమిషనర్, బ్యాంక్ అధికారులు, ఏపీడీ, డీపీఎం, స్వయం సహాయక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News