మన తెలంగాణ/నెక్కొండ: భూ భారతి, రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులకు తావు లేకుండా రేపటి లోగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. బుధవారం నెక్కొండ తహసీల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిచేందుకు తగు సూచనలు చేశారు. దరఖాస్తుదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా డిస్పోట్ చేయాలన్నారు.
భూ భారతి దరఖాస్తులు పరిశీలించుటకు గడువు ఈనెల 15గా ప్రభుత్వం నిర్ణయించిందని భూ భారతి సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి పాత రికార్డులలను క్షుణ్ణంగా పరిశీలించి రేపటి లోగా పూర్తి చేయాలన్నారు. తహసీల్దారు కార్యాలయంలోని సిబ్బంది బృందంగా ఏర్పాటుచేసుకొని ఫీల్డ్ విజిట్ చేసి భూ భారతి పెండింగ్ దరఖాస్తులను రేపటి లోగా పూర్తి చేయాలని తహసీల్దారును ఆదేశించారు. కార్యాలయంలో పర్సనల్ రిజిష్టర్లురు, మూమెంట్ రిజిష్టర్ తప్పనిసరిగా ఆచరించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అన్నారు. ఈ తనిఖీల్లో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఏఓలు ఫణికుమార్, డీటీడీఓ సౌజన్య, నెక్కొండ తహసీల్దారు రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.