Sunday, April 28, 2024

కంటోన్మెంట్ లో వ్యాక్సిన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 6,7,8 వార్డులోని వ్యాక్సినేషన్ సెంటర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు స్వచ్చందంగా వచ్చి రెండవ డోసు వ్యాక్సిన్ చేయించుకోవాలని, అధికారులు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చేయాలని, వందశాతం వాక్సినేటెడ్ నగరం తయారు చేయాలన్నారు. ఈప్రాంతంలో అధికారుల ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలని వాక్సిన్ రెండవ డోసు వేయించుకుని వారిని గుర్తించి వారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చి వాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు.

అర్హులైన వారందరికి రెండవ విడుత వాక్సినేషన్ జరిగేలా చేస్తామన్నారు. కలెక్టర్ ఇంటింటికి వెళ్లి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఇళ్లలోని వారిని పిలిచి అందరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాదికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి రామారావు, బిసి సంక్షేమ సంఘం అధికారి ఆశన్న, జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌రావు పాల్గొన్నారు.

Collector Sharman visit Vaccine Center in Cantonment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News