Tuesday, May 14, 2024

కెటిఆర్ పుట్టినరోజు: గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న అలీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా అమీర్ పేట్ లోని సారధి స్టూడియో లో సినీ నటుడు అలీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అలీ అన్నారు.

మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.అనంతరం హీరో శ్రీకాంత్, ఉమ, ఉత్తేజ్ ముగ్గురికి అలీ చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News