Thursday, May 2, 2024

త్వరలో అందుబాటులోకి రానున్న మరో 3 స్విచ్చింగ్ స్టేషన్లు

- Advertisement -
- Advertisement -
coming soon another 3 switching stations in hyderabad
యుద్దప్రాతిపదిక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలకు అధికారులు పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 7న దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ )సీఎండి రఘుమారెడ్డి మాదాపూర్‌లో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన 33 కేవీ స్విచ్చింగ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. వీటినే కాకుండా నానక్‌రామగూడలో రూ. 8 కోట్ల వ్యయంతో అదే విధంగా రూ.7.50 కోట్ల వ్యయంతో మరో శిల్పారామంలోని మరో స్విచ్చింగ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీనితో పాటు బంజారాహిల్స్‌లో కూడా మరో స్విచ్చింగ్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అభివృద్ది పరంగా హైదరాబాద్ మహనగరం దేశానికే తలమానికంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రెవెన్యూ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. నగరం నుంచే సుమారు 60 శాతం రెవెన్యూ విద్యుత్ శాఖకు సమకూరుతోంది.

సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేష్లపరిధిలో విద్యుత్‌కు అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ లైన్ ( మరో ఫీడర్ లైన్‌కు మార్చడం) ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ఈ విధంగా ఫీడర్ మార్చాలంటే సుమారు గంటకు పైగా సమయం పట్టడమే కాకుండా ఇందు కోసం 15 మంది క్షేత్రస్థాయి సిబ్బంది కూడా పని చేయాల్సి ఉంటుంది. కాని కొత్తగా అందుబాటులోకిరానున్న స్విచ్చింగ్ స్టేషన్ల అంతరాయం ఏర్పడితే సెకన్ల వ్యవధిలోనే ఫీడర్ ద్వారా విద్యత్ సరఫరా అవుతుంది. అయితే ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది శ్రమించాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా పీడర్ మారి విద్యుత్ పునరుద్దరణ జరుగుతుంది. ఈ స్విచ్చింగ్ స్టేషన్ల వల్ల వినియోగ దారులకు ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా సంస్థకు రెవెన్యూ పరంగా ప్రయోజం చేసుకూరుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సర్కిళ్ళలో విద్యుత్ రెవెన్యూ అధికంగా ఉండేది వాటిలో సైబర్ సిటీ ముఖ్యమైంది. ఈ సర్కిల్ పరిధిలో 61 సబ్‌స్టేషన్లు, 33/ 11 కేవీ ఫీడర్లు సుమారు 250 ఉన్నాయి. సర్కిల్ పరిధిలో విద్యుత్ కనెక్షన్లు ్ల 5.23 లక్షలు కాగా ఇందులో గృహ వినియోగదారులు 4.27 లక్షలు, హెచ్‌టి కనెక్షన్లు 1300, కమర్షియల్ కనెక్షన్లు 68 వేలు ఉన్నాయి. ఈ సర్కిల్ పరిధిలో ప్రతి నెలా సుమారు రూ. 90 కోట్లకు పైగా రెవెన్యూ వస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News