Thursday, May 2, 2024

పుల్వామా అమరుల కుటుంబాలకు రూ.2. 94 కోట్ల పరిహారం : కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్ల పరిహారం అందజేశామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. 2019 లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రస్తుత స్థితి వివరాల జాబితాను కేంద్ర మంత్రి సభకు తెలిపారు. జవాన్ల కుటుంబాలకు పరిహారంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు పెద్ద మనసుతో ఇచ్చిన విరాళాలను సైతం అందజేశామని చెప్పారు. సైనికుల కుటుంబీకులకు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించామని రాయ్ పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ , ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కిందిస్థాయి ఉద్యోగాల్లో కొందరు చేరారని వివరించారు. అనేక మంది జవాన్ల కుటుంబ సభ్యుల నుంచి తమ కుమారులకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉద్యోగాలు ఇవ్వాలనే అభ్యర్థనలు వచ్చినట్టు తెలిపారు. ఒక సైనికుడి భార్యకు పంజాబ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా అవకాశం కల్పించామన్నారు. మరొకరు హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రం కాంగ్రాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారని వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 14న ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్ధాలు నిండిన కారుతో జవాన్ల వాహనాన్ని ఢీకొట్టాడు . ఈ ప్రమాదంలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News