Saturday, May 4, 2024

లేఖలతో లాభం లేదు.. చేతలు ముఖ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తుత్తి లేఖలతో లాభం లేదని, అధికార పక్షం తమ చేతలతో ముందు ప్రతిపక్షాల విశ్వాసం పొందాల్సి ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మణిపూర్ పరిస్థితిపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానానికి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ముందు దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అని దీనికి సహకరించాలని హోం మంత్రి అమిత్ షా పంపించిన లేఖపై ఖర్గే బుధవారం స్పందించారు. ఎవరైనా లేఖ ద్వారా తమ స్పందనలను అత్యద్భుతంగా తెలియచేయగలరు. అయితే అధికార పక్షం ప్రతిపక్షాల నమ్మకం చూరగొనడం కేవలం వారి రాతల ద్వారా కాకుండా చేతల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. ముందు ప్రతిపక్షాల పట్ల అధికార పక్షం వ్యవహారశైలి మారాల్సి ఉందన్నారు.

పార్లమెంట్‌లో ఇప్పటి ప్రతిష్టంభనపై కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, ఖర్గేలకు తాను లేఖలు రాసినట్లు హోం మంత్రి మంగళవారం తెలిపారు. వీరు లోక్‌సభలో , రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేతలుగా ఉన్నారు. మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలు సజావుగా సాగేలా చూడాల్సి ఉందని ఈ లేఖలలో అమిత్ షా తెలిపారు. దీనిపై ఖర్గే స్పందించారు. చెప్పడం బాగానే ఉంటుంది. కానీ కార్యాచరణ విషయంలోనే తేడా వస్తోందన్నారు. ఓ వైపు ప్రదాని మోడీ ప్రతిపక్షాలను ఉగ్రవాద సంస్థలతో పోలుస్తారు. ఈ విధంగా తిట్టిపోస్తారు. మరో వైపు హోం మంత్రి లేఖలు రాస్తారని, ఈ విధంగా చూస్తే ఇక ప్రభుత్వానికి ప్రతిపక్షాలకే కాకుండా , ప్రభుత్వ పక్షంలోని వారి మధ్య కూడా వైరుద్ధం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News