Tuesday, April 30, 2024

కాంగ్రెస్ అంటే స్కాములు, స్కీములు తప్ప మరేంలేదు

- Advertisement -
- Advertisement -
  • అవగాహన రాహిత్యంతో స్క్రిప్టు చదివిన రాహుల్
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా

గజ్వేల్: సిఎం కెసిఆర్ సారథ్యంలో తొమ్మిది సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, ప్రజల మనసును దోచుకున్న తమ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో కూడా ఎలాంటి ఢోకాలేకుండా హ్యాట్రిక్ సిఎంగా తిరిగి కెసిఆ ర్ ఉంటారని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపే జిల్లా గజ్వేల్ పట్టణంలోని సి ఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం గజ్వేల్ ని యోజకవర్గంలోని బిఆర్‌ఎస్ ముఖ్య నేతలతో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ కాలేశ్వరంపైన ,తెలంగాణలోని ఇతర అంశాలపైన కనీస అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ప్రతాపరెడ్డి ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికే రూ.80 వేల కోట్ల వ్యయం అయితే అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రా హుల్ ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని ఆయ న అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో 11 వందల మంది అమరులవటానికి కా రణం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అంటే స్కాములు, స్కీములు త ప్ప సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత లేదన్నారు. బి జెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కనీసం ఆహార సమస్యతో పేదలు అలమటిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్రంలో అని వర్గాల సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక సిఎం కెసిఆర్ అన్నారు. కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీ మా, ఆసరా పథకం తదితర సంక్షేమ పధకాలతో సంక్షేమ ప్రభుత్వంగా దేశంలోనే తెలంగాణకు గు ర్తింపు ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం,ఉచిత కరెంట్ , సాగునీరు ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం తమదన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కా నీ సిఎం కెసిఆర్ పాలనను కానీ విమర్శించే నైతికత కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులకు లేదని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, జడ్పిటిసిలు పంగ మల్లేశం, రాంచంద్రం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్ర మోహన్, కొండపాక ఎంపిపి నూనె కుమార్, ఎంపిటిసి ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మర్కూక్, గజ్వేల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కుణాకర్ రెడ్డి,బెండె మధు, కొండపాక బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దుర్గయ్య, నాయకులు గుంటుకు రాజు,దుంబాల కిషన్ రెడ్డి, నవాజ్ మీరా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News