Sunday, April 28, 2024

ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఏల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

 

Congress suspends 3MLAs

రాంచీ:  జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కారులో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్, నమన్‌ బిక్సల్‌ కొంగరిలను శనివారం రాత్రి బెంగాల్‌లోని హౌరా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. భారీ మొత్తంలో డబ్బుతో పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జార్ఖండ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే తెలిపారు.

జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది.  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి కుట్రలు చేస్తోందిన కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌ కమల్లో భాగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేశారని అంటున్నారు. దీంతో, కాంగ్రెస్‌ నేతల వ్యవహారం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News