Thursday, May 2, 2024

వనపర్తి దాడి ఘటనపై కెటిఆర్ ఆగ్రహం.. కానిస్టేబుల్ సస్సెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనపర్తి దాడి ఘటనలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో బుధవారం ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని చితకబాదారు. దీన్నీ వీడియో తీసిన ఓ నెటిజన్ మంత్రి కెటిఆర్ కు ట్వీట్ చేశారు. వీడియోని చూసిన కెటిఆర్ పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్త చేశారు. కొందరు పోలీసుల అతిప్రవర్తన వల్ల తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. పౌరులతో పోలీసులు బాధ్యతయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డిజిపి, వనపర్తి ఎస్‌పి, తెలంగాణ హోంమంత్రిని కోరారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ అపూర్వరావు సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

Constable Suspended due to attack on Man in Wanaparthy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News