Tuesday, April 30, 2024

కార్మికుల కాలనీల్లో సౌకర్యాల కల్పన

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి యాజమాన్యం సౌకర్యంతో కార్మిక కాలనీల్లో సౌకర్యాలు కల్పించేందుకు విశేషమైన కృషి చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆర్‌జి2 జిఎం అయిత మనోహర్ ఆధ్వర్యంలో కార్పోరేషన్ పరిధిలోని 17వ డివిజన్‌లోని సంతోష్‌నగర్, 19వ డివిజన్‌లోని మహాకవి పోతనకాలనీల్లో యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లను ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చమైన నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందనే ఉద్దేశ్యంతో సింగరేణి సహకారంతో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 8వ కాలనీ నుంచి మహాకవి పోతనకాలనీలో ఇబ్బందిగా ఉన్న వాగుపై కల్వర్టును తొలగించి బ్రిడ్జిని నిర్మించామన్నారు. అలాగే సౌకర్యవంతమైన రోడ్లు, మార్కెట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను అధిగమించామన్నారు.

రాబోయే కాలంలో మంచినీటి సమస్య తీర్చేందుకై 20 కోట్లతో ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించి, అధునాతన సాంకేతిక పరిజ్ఙానంతో నీటిని ఫిల్టరైజేషన్ చేసి, స్వఛ్చమైన నీటిని ప్రజలకు అందిస్తామన్నారు. కార్మిక కుటుంబాల శుభకార్యాలకై 2.50 కోట్లతో కమ్యూనిటీహల్ నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమానికై నిరంతరం కృషి చేస్తానన్నారు. జిఎం మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యార్ధం రెండు వేల లీటర్ల సామర్ధం కలిగిన రెండు ఆర్‌వో ప్లాంట్లను 33 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

సంస్థ చైర్మెన్‌కు జిఎం కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ, బాదే అంజలీదేవి, టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు మేడి సదయ్య, గౌస్‌పాషా, పులి రాకేశ్, సారయ్యనాయక్, ఓరుగంటి శంకర్, పాయిత సంపత్, ఎరవెల్లి గోపాల్‌రావ్, గొడిసెల రవి, మోహన్, కుమార్‌నాయక్, జక్కుల దామోదర్‌రావ్, చెరుకు ప్రభాకర్‌రెడ్డి, బేతి చంద్రయ్య, బండ రమేష్‌రెడ్డి, ఆకుల విజయ, స్వరూప, రోజా తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News