సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie) . ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఆగస్టు 14న విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ అన్ని చిత్రంపై అంచనలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ని వచ్చింది. ఇటీవల చెన్నై వేదికగా కూలీ ఆడియో లాంచ్ జరిగింది. ఆ కార్యక్రమాన్ని సన్ నెక్ట్స్ యాప్‌లో అందుబాటులోకి తీసుకువ్చారు. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రజనీకాంత్ స్పీచ్, అనిరుధ్ లైవ్ ఫర్ఫామెన్స్, మెనికా పాటకు సౌబిన్ షాహఇర్ వేసిన డ్యాన్స్‌తో పాటు ఇతర విశేషాలను ఇందులో మనం చూడొచ్చు.
ఇక సినిమా (Coolie) విషయానికొస్తే.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తొలిసారి కింగ్ నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అమిర్‌ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.