Saturday, April 27, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు కోరె ఆండర్సన్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Corey Anderson goodbye to international cricket

 

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు, కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న 29 ఏళ్ల ఆండర్సన్ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆండర్సన్ 13 టెస్టులు,49 వన్డేలు,31 టి20 లలో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే యుఎస్‌ఎ మేజర్ లీగ్ ( యుఎంఎల్)తో మూడేళ్ల ఒప్పందం కుర్చుకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు.2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. కాగా ఆ రికార్డును దక్షిణాఫ్రికాకు చెందిన ఎబి డివిలియర్స్(31 బంతుల్లో) బద్దలు కొట్టాడు. తన కాబోయే భార్య మేరీ మార్గరేట్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, తన కోసం అమెరికానుంచి న్యూజిలాండ్ వచ్చి కష్టకాలంలో తనకు అండగా నిలిచిందని ఆండర్సన్ చెప్పాడు. ఇప్పుడామె అమెరికాలో ఉంటోందని, ఆమె కోరిక మేరకు రిటైర్మెంట్ తర్వాత యుఎస్ మేజర్ క్రికెట్ లీగ్‌లో ఆడతానని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News